Home / SLIDER (page 641)

SLIDER

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా

మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కోవిడ్ లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 4,416 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన  గత 24 గంటల్లో 1,20,243 శాంపిల్స్ పరీక్షించారు.ఇందులో  కొత్తగా 4,416 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,920 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,127 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

GHMCలో భారీగా కరోనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు భారీగానే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1,670 కరోనా కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,69,636 కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Read More »

విరాట్ కోహ్లి ఖాతాలో ఓ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లి ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున వన్డే క్రికెట్లో రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్ు 13 సార్లు డకౌట్ కాగా, కోహ్లి వారిని దాటేసి 14 డకౌట్లతో రైనా, సెహ్వాగ్, జహీర్ తో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరికంటే ముందు సచిన్ (20 డకౌట్లు), జగవల్ శ్రీనాథ్ (19 డకౌట్లు), అనిల్ కుంబ్లే, యువరాజ్ సింగ్ …

Read More »

వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా

సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో ఓడిన భారత్.. తాజాగా వన్డే సిరీస్ కూడా కోల్పోయింది. ఈ రోజు జరిగిన 2వ కీలక వన్డేలో టీమ్ ఇండియా 7 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 287/6 స్కోర్ చేసింది. ఛేజింగ్కి దిగిన సౌతాఫ్రికా 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో రన్స్ చేధించింది. దీంతో మరో వన్డే మ్యాచ్ ఉండగానే …

Read More »

గోవా బీజేపీకి షాక్

గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీని వీడారు. తాను ఆశించిన నియోజకవర్గం టికెట్ కేటాయించకపోవడంతో అలకబూనారు. పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడనున్నట్లు వెల్లడించారు. తన తండ్రి పోటీ చేసిన పనాజీ నియోజకవర్గాన్ని సెంటిమెంట్గా భావించి.. అక్కడ నుంచే పోటీ చేస్తున్నట్లు ఉత్పల్ పారికర్ తెలిపారు.

Read More »

ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం

ఈ సంక్రాంతి పండుగ ఏపీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. ఈ నెల 7 నుంచి 18 వరకు రూ. 144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు వివరించారు. అత్యధికంగా ఈ నెల 17వ తేదీన ఒక్కరోజే రూ.15.40 కోట్లు వచ్చిందన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ

అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …

Read More »

బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది- మంత్రి సత్యవతి రాథోడ్

దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.

Read More »

దేశంలో అందులో ఏపీ టాప్

దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ   టాప్లో ఉంది.. 91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat