ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దంపతులు, వారి కుమారుడు కన్నా నాగరాజుపై ఆయన భార్య శ్రీలక్ష్మి వేసిన గృహ హింస కేసు రుజువైంది. దీంతో ఆమెకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని విజయవాడ ఒకటో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాలిచ్చింది. అలాగే పిటిషనరు, ఆమె కుమార్తెకు ప్రతివాదుల ఇంటిలో నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది. లేదంటే నెలకు రూ. 50వేలు చెల్లించాలని పేర్కొంది.
Read More »బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్
దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు 30వేల కేసులు పెరిగాయి. ఇక కొత్తగా 491 మంది వైరస్లో మరణించారు. మరోవైపు తాజాగా 2,23,990 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Read More »తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,557 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 574 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,11,178 టెస్టులు నిర్వహించారు.
Read More »ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ క్లారిటీ
ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.
Read More »ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.
Read More »దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు
ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .. మహారాష్ట్రలో 43,697 కరోనా కేసులు కర్ణాటకలో 40,499 కరోనా కేసులు కేరళలో 34,199 కరోనా కేసులు గా గుజరాత్లో 20,966 కరోనా కేసులు తమిళనాడులో 26,981 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్లో 17,776 కరోనా కేసులు ఢిల్లీలో 13,785 కరోనా కేసులు ప. బెంగాల్లో 11,447 కరోనా కేసులు ఆ ఏపీలో 10,057 తెలంగాణలో 3557 కరోనా కేసులు
Read More »బరువు తగ్గాలంటే ఇది చేయాలి..?
బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి. మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, …
Read More »శ్రీలంకకు అండగా భారత్
విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …
Read More »ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై కేసు నమోదు
ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీవీపీ తన అనుచరులను పంపి బెదిరిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ కూతురు శృతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించి ప్రహరీ గోడ కూడా కూల్చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »