దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,59,632 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 18వేల కేసులు ఎక్కువగా వచ్చాయి. పాజిటివిటీ రేటు రికార్డు స్థాయిలో 10.21%గా నమోదైంది. దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 5లక్షల 90వేలు దాటింది. ఇక 24గంటల్లో కరోనా మహమ్మారితో మరో 327 మంది మరణించారు. 40,863 మంది కోలుకున్నారు.
Read More »దేశంలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు
దేశంలో కరోనా కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ మొత్తం 3,623 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో వీటిని గుర్తించారు. మహరాష్ట్ర-1,009, ఢిల్లీ-513, కర్ణాటక-441, రాజస్థాన్-373 కేసులు రాగా.. TS-123, AP-28 కేసులు నమోదయ్యాయి. ఇక, మొత్తం బాధితుల్లో 1,409 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఇంట్లో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడైన రమేష్ బాబు (56) అనారోగ్యంతో మృతి చెందారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనని హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మృతితో టాలీవుడ్ …
Read More »తెలంగాణకు అస్సాం సీఎం హిమాంత బిస్వా
తెలంగాణకు బీజేపీ ముఖ్యమంత్రులు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ సీఎం రాగా.. ఆదివారం అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ వస్తున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు రాష్ట్ర బీజేపీ నేతలు బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలకనున్నారు. అస్సాం సీఎం బండి సంజయ్‌తో కలసి రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరతారు. మధ్యహాన్నం 12గంలకు ఉపాధ్యాయ, నిరుద్యోగ, ఉద్యోగ సమస్యలపై బండి సంజయ్‌తో కలసి హిమాంత …
Read More »GHMCలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
కొవిడ్ శరవేగంగా నగరాన్ని చుట్టేస్తోంది. భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత నెలలో వచ్చిన మొత్తం కేసుల కంటే ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం రోజుకు సగటున 576 వరకు కేసులు నమోదయితే, శనివారం ఒక్కరోజే 1,583 మందికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన ఎనిమిది రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 6,610 మందికి వైరస్ సోకింది. …
Read More »మీ కేంద్రమంత్రులే మా రాష్ట్రాన్ని మెచ్చుకున్నారు-మంత్రి హారీష్ రావు
‘‘మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓ నరహంతకుడు. పట్టపగలే ఆ రాష్ట్రంలో ఆరుగురు రైతులను కాల్చి చంపించిన చరిత్ర ఆయనది. ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో అమ్ముకున్నారనే ఆరోపణలు ఆయన కుటుంబసభ్యులపై ఉన్నా యి. అవినీతి ఊబిలో మునిగి దొడ్డి దారిన ముఖ్యమంత్రిగా కుర్చీ ఎక్కిన ఘనత ఆయనది. అలాంటి నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి వచ్చి సీఎం కేసీఆర్‌ను విమర్శించడం సిగ్గుచేటు. ఏదిబడితే అది మాట్లాడొద్దు. ఇక్కడి అభివృద్ధిని …
Read More »విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలి
దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్టాన్ లో జరగాల్సిన టెస్టు మ్యాచ్ లో అజింక్య రహానెకు బదులుగా విహారిని జట్టులో తీసుకోవాలని మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. రెండో టెస్టుకు కోహ్లి దూరమవడంతో విహారికి అవకాశం ఇచ్చారు. మూడో టెస్టు కోసం కోహ్లి తిరిగి జట్టులో చేరనున్న నేపథ్యంలో గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. విహారికి కూడా అవకాశాలు ఇవ్వాలని, రహానె ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడని గౌతీ చెప్పాడు.
Read More »కరోనాతో అల్లాడిపోతున్న మహారాష్ట్ర
దేశంలో కరోనా భీభత్సానికి కేంద్ర బిందువుగా మారిన మహారాష్ట్ర కరోనాతో అల్లాడిపోతుంది.రోజురోజుకి కరోనా కేసులు ఎక్కువైపోతున్నాయి.ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఆ రాష్ట్రంలో ఏకంగా 40,925 కొత్త కరోనా కేసులు నమోదవ్వడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దాదాపు 20మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,492కు చేరింది. ఒమిక్రాన్ కేసుల్లోనూ మహారాష్ట్ర నే …
Read More »తమిళనాడులో కరోనా విలయతాండవం
నిన్న మొన్నటివరకు వరదలతో అతలాకుతలమైన తమిళనాడు తాజాగా కరోనా విలయతాండవంతో అయోమయంలో పడింది ఆ రాష్ట్ర ప్రజల జీవితం.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా భీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో తమిళనాడులో గడిచిన ఇరవై నాలుగంటల్లో ఏకంగా 8,981కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వైరస్ వల్ల ఏకంగా 8మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 30,817 యాక్టివ్ కేసులు ఉన్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో …
Read More »సత్యరాజ్ కి కరోనా
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కరోనా బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటున్నాడు. కాగా.. గత రాత్రి పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ‘బహుబలి’లో కట్టప్పగా సత్యరాజ్ అందరికి సుపరిచితుడు.
Read More »