Home / SLIDER (page 685)

SLIDER

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు కలకలం

న్యూఢిల్లీ-కర్ణాటక Express Trainలో  బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ఓ వ్యక్తికి రైలులో క్యాటరింగ్ సిబ్బంది తీరు నచ్చలేదు. ఆగ్రహానికి గురైన అతడు సోదరుడికి చెప్పడంతో.. ఆ వ్యక్తి రైలులో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ సిబ్బంది మెటల్ డిటెక్టర్లు, డాగ్ స్క్వాడ్తో రైలు మొత్తం తనిఖీ చేశారు. బాంబు లేకపోవడంతో ఫోన్ కాల్పై విచారణ చేయగా అసలు విషయం బయటపడింది.

Read More »

అరటిపండ్లు కవర్లో పెడితే..?

అరటిపండ్లు కవర్లో పెడితే పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే బయటకు తీసి విడివిడిగా ఉంచాలి. ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే పేపర్లో చుట్టి పెట్టాలి. బంగాళదుంపలు చల్లని నీటిలో వేసినట్లయితే వాటి తొక్క సులువుగా ఊడిపోతుంది. కోడిగుడ్లు ఉడికించి తరువాత వాటిని ఒక డబ్బాలో వేసి ఊపాలి. ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల పెంకులన్నీ పగులుతాయి.

Read More »

TPCC  చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC  చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …

Read More »

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …

Read More »

బాహుబలిని దాటిన పుష్ప

సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా రూ.144.90 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.101.75 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసిన చిత్రాల జాబితాలో ‘పుష్ప’ 4వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ కంటే ముందు వరుసలో బాహుబలి 2, సాహో, సైరా నరసింహారెడ్డి ఉన్నాయి. అయితే బాహుబలి 1 రికార్డును ‘పుష్ప’ అధిగమించిందని …

Read More »

లైగర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్

టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31న గ్లింప్స్ విడుదల చేస్తామని తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్ దేవరకొండకు …

Read More »

మగబిడ్డకు జన్మనిచ్చిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త భార్గవ్ రామ్ సోషల్ మీడియా   వేదికగా ప్రకటించారు. అఖిలప్రియ తల్లి శోభనాగిరెడ్డి జయంతి రోజునే బాబు పుట్టడంతో భూమా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. శోభనాగిరెడ్డి మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరారు. ఆ తర్వాత మంత్రి …

Read More »

ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హైకోర్టు సంచలన నిర్ణయం

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఇచ్చిన జీవోపై విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారానికి వాయిదా వేసింది. దీనిపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. టికెట్ ధరల ప్రతిపాదనలను థియేటర్ యజమానులు జాయింట్ కలెక్టర్ ముందుంచాలని ఆదేశించింది. టికెట్ల ధరలపై జాయింట్ కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపింది. టికెట్ల ధరల నిర్ణయంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Read More »

తమిళనాడుకు పాకిన ఒమిక్రాన్

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు వ్యాపించేలా కనిపిస్తోంది. తాజాగా తమిళనాడులో ఒమిక్రాన్ తొలి కేసు నమోదైంది. నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 47 ఏళ్ల చెన్నై వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ వెల్లడించారు. మరోవైపు UKలో ఒమిక్రాన్ విజృంభిస్తోంది.ఇప్పటికే 10వేల కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 20వేల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

Read More »

యూకేలో తీవ్రం రూపం దాల్చిన కరోనా మహమ్మారి

యూకేలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చింది. ఇవాళ ఒక్కరోజే ఆ దేశంలో ఏకంగా 78,610 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే అత్యధికం. మరోవైపు కరోనా కారణంగా 165 మంది మరణించారు. ఇప్పటి వరకు యూకేలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,46,791కి చేరింది. ఇదిలా ఉండగా.. 10,017 ఓమిక్రాన్ వేరియంట్ కేసులతో దేశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat