Home / SLIDER (page 704)

SLIDER

కన్నకూతురిపై కన్నతండ్రే..!

ఏపీలోని అనంతపురం జిల్లా గుంతకల్లులో దారుణం జరిగింది. కన్న కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి ఆమెను గర్భవతిని చేశాడు. తాగుడుకు బానిసైన ఆ వ్యక్తికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 15 ఏళ్ల వయసున్న పెద్ద కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. 2 రోజుల క్రితం ఒంట్లో నలతగా ఉండటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. టెస్టులు చేయగా బాలిక గర్భవతి అని తేలింది.

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు నిర్వహించే స్కూళ్లలో 20 మంది లోపు విద్యార్థులు ఉంటే గుర్తింపును రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. తొలుత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులిచ్చి, అనంతరం మూసివేత ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది.

Read More »

దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,264 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 1,09,940గా ఉన్నాయి. గడిచిన 539 రోజుల్లో యాక్టివ్ కేసులు తక్కువ నమోదవడం ఇదే తొలిసారి. నిన్న 1,11,481 యాక్టివ్ కేసులుండగా.. ఈ రోజు అది మరింత తగ్గింది.

Read More »

LED దీపాలతో వందల కోట్లు ఆదా- మంత్రి KTR.

జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల కోట్ల నిధులు ఆదా అవుతున్నాయని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఘనత అంతా మున్సిపల్‌శాఖ బృందానిదేనని కొనియాడారు. గచ్చిబౌలిలోని పురాతన భావిని పునరుద్ధరించి పూర్వ స్థితికి తీసుకొచ్చిన అధికారులను కేటీఆర్‌ అభినందించారు. వెల్‌ డన్‌ అంటూ మూన్సిపల్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌, చిరేక్‌ …

Read More »

MLC గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం

ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించారు. శ్రీనివాస్ అఫిడ‌విట్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలోనే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. క‌విత ఏక‌గ్రీవంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. ఉమ్మడి నిజా‌మా‌బాద్‌ జిల్లా నుంచి కల్వ‌కుంట్ల కవిత మరో‌సారి బరి‌లోకి దిగిన విష‌యం …

Read More »

దేశంలో తగ్గిన Carona Cases

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,283 కరోనా కేసులు నమోదయ్యాయి. 10,949 మంది కోలుకున్నారు. 437 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1,11,481 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 537 రోజుల్లో అత్యల్ప యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

Read More »

భారత్ లో Carona Third Wave ఉందా..?

కరోనా నుంచి దేశానికి ఉపశమనం లభించినట్లేనని నిపుణులు అంటున్నారు. గత 3 వారాలుగా కొత్త కేసులు తగ్గాయి. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందనుకున్న పండుగల సీజన్ సేఫ్ గానే ముగిసింది. 98.32% రికవరీ రేటుతో.. జనాల్లో యాంటీబాడీలు పెరిగాయి. ఇక వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. అందర్నీ భయపెట్టిన థర్డ్ వేవ్ వెళ్లిపోయిందని భావిస్తున్నారు. అయితే.. కొత్త వేరియంట్ ముప్పు, చలికాలం నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు భారత్లో కరోనా …

Read More »

కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు

బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ  నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.

Read More »

మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం

Tollywood కి చెందిన’మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా AIG, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ‘మా’ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు తెలిపాడు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపాడు.

Read More »

ఆ కోరిక నెరవేరింది అంటున్న పూజా హెగ్డే

టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.. అందాల రాక్షసిగా పేరున్న ఉన్న పూజాహెగ్దే.. హాలిడే ట్రిప్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. తాజాగా లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఉన్న పిక్ షేర్ చేసింది..  ఈ క్రమంలో పూజా ఆయనతో కలిసి పని చేయాలని ఎప్పట్నుంచో ఉన్న కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని విశేషాల కోసం వేచి చూడండి అని పోస్ట్ చేసింది. ఇక, వీరిద్దరు కలిసి ఏదైనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat