ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని ఉన్న స్కూళ్లకు ఈ నెలలో 8 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 15, ఆగస్టు 25 వరలక్ష్మీ వ్రతం, ఆగస్టు 31- రాఖీ పౌర్ణమికి సెలవు ఉంది.. నాలుగు ఆదివారాలు (6, 13, 20, 27)తో పాటు ఆగస్టు 12న రెండో శనివారం కూడా సెలవు ఉండనుంది. గత నెలలో వర్షాలతో తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ఇవ్వగా.. రెండో శనివారం సెలవు ఇస్తారా? పనిదినంగా ఉంటుందా …
Read More »వాట్సాప్ ఖాతాలపై నిషేధం
దేశవ్యాప్తంగా జూన్ నెలలో 66 లక్షల వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. యూజర్ సేఫ్టీ రిపోర్ట్లో అందిన ఫిర్యాదులు, నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సొంత మెకానిజం ఆధారంగా ఈ వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసినట్లు తెలిపింది. జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 66,11,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేయగా.. ఇందులో 24,34,300 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించినట్లు పేర్కొంది.
Read More »సింగరేణి కార్మికులకు తీపి కబురు
సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. మే 19న జరిగిన 11వ వేతన సవరణ ఒప్పందాన్ని యాజమాన్యం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 23 నెలల బకాయిలు ఈనెల వేతనంతో కలిసి సెప్టెంబర్ నెలలో చెల్లించనుందని సమాచారం. 19 శాతం మినిమం గ్యారెంటీ బెనిఫిట్, 25 శాతం అలవెన్సులను చెల్లించనుందట. దీంతో ఫస్ట్ కేటగిరీ కార్మికుడికి రూ.12వేల వరకు జీతం పెరగనుంది. దీనిపై సింగరేణి యాజమాన్యం త్వరలో ప్రకటన చేయనుందని వార్తలు …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త
తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే ఉద్యోగుల వేతన సవరణ కమిషన్(PRC)తో పాటు మధ్యంతర భృతిని ప్రకటిస్తామని, EHS పక్కాగా అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలతో జరిగిన భేటీలో ఆయన హామీ ఇచ్చారు. 2వ పీఆర్సీని ఏర్పాటు చేసి, 2023 జూలై 1 నుంచి అమలయ్యేలా ఐఆర్ ను ప్రకటించాలని ఉద్యోగులు కోరారు.. సీఎం సానుకూలంగా స్పందించారు. ఇవాళ లేదా రేపు అసెంబ్లీలో పీఆర్సీ …
Read More »అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈటల పై మంత్రి కేటీఆర్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పది గంటల నుండి సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఐటీ ఎగుమతులపై ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఇచ్చే క్రమంలో మాట్లాడుతూ… బయట ఈ కుంభకోణం ఆ కుంభకోణం అంటూ కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారన్నారు. ఈ రోజు ఎకరం భూమి ధర రూ.100 కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగిందంటే ఆషామాషీ కాదన్నారు. …
Read More »