తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న మంగళవారం మొత్తం 70,280 పరీక్షలు నిర్వహించగా మొత్తం 431 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. ఈ ప్రకటనను తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు బుధవారం మీడియాకు విడుదల చేశారు. అయితే రాష్ట్రంలో అత్యధికంగా రాష్ట్ర రాజధాని మహానగరమైన జీహెచ్ఎంసీ పరిధిలోనే 111 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 37,రంగారెడ్డి …
Read More »మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభవార్త
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక శుభవార్తను తెలిపారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీ నియామాకాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సబితా తెలిపారు.బుధవారం అసెంబ్లీ సబ్జెట్ సమావేశాల్లో జరిగిన పాఠశాల విద్య,ఉన్నత విద్య,సాంకేతిక విద్య పద్దులపై పలు పార్టీలకు చెందిన సభ్యులు అడిగిన …
Read More »షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్
తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు. బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని …
Read More »జిల్లా ఆస్పత్రుల్లోనూ డయాగ్నొస్టిక్ సెంటర్లు : మంత్రి ఈటల
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగ నిర్ధారణ కేంద్రాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఇప్పటికే ప్రమాణాల ప్రకారంగా డయాగ్నోస్టిక్ సౌకర్యాలను కలిగి ఉన్నాయి. దీనికి అదనంగా జిల్లా ఆస్పత్రుల్లో కొత్తగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్, సిద్దిపేట జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే రెండు సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ ల్యాబ్‌లలో 60 రకాల పరీక్షలు …
Read More »చెత్తను తరలించేందుకు స్వచ్ఛ ఆటోలు -మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే 2500 స్వచ్ఛ ఆటోలు నడుస్తున్నాయని మంత్రి కెటిఆర్ తెలిపారు. గురువారం ఉదయం కెటిఆర్ స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 325 స్వచ్ఛ ఆటోలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెత్తను తరలించేందుకు ఇంతవరకు ఉన్న పాత వాహనాలకు స్వస్తి పలికి స్వచ్ఛ ఆటోలను నడిపిస్తున్నామని ఆయన చెప్పారు. ఒక్కో స్వచ్ఛ ఆటో 1.5 మెట్రిక్ టన్నుల గార్బేజ్ ను తరలిస్తుందని ఆయన పేర్కొన్నారు. …
Read More »నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా రైతు వేదికలు : మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రైతు వేదికలు నిర్మించామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణాల కోసం రూ. 572 కోట్ల 22 లక్షల మొత్తాన్ని ఖర్చు చేశామన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించడం కోసం, నైపుణ్య శిక్షణా కేంద్రాలుగా …
Read More »తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాల్లో స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగిసిన వెంటనే బడ్జెట్ పద్దులపై చర్చ ప్రారంభించనున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.గత రెండు రోజులుగా 26 పద్దులపై చర్చించి వాటిని ఆమోదించారు. ఇవాళ …
Read More »ఎమ్మెల్సీ వాణీదేవి కారుకు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారు ప్రమాదానికి గురైంది. అసెంబ్లీ గేట్ నంబర్ ఎనిమిదిని ఆమె కారు ఢీకొన్నది. ఎమ్మెల్సీని మండలి వద్ద దింపి వస్తుండగా ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేస్తుండగా అదుపుతప్పిన కారు రైల్వే కౌంటర్ సమీపంలోని గేటుపైకి దూసుకెళ్లింది. దీంతో కారుటైరు పేలిపోయింది. ప్రమాద సమయంలో కారును ఎమ్మెల్సీ గన్‌మెన్ నడిపినట్లు సమాచారం. అయితే భారీగా శబ్ధం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం-మంత్రి నిరంజన్ రెడ్డి
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా హార్వెస్టర్లు, ఇన్నోవర్స్, రీపర్ల వంటి ఆధునిక వ్యవసాయ పరికరాలు రైతులకు అందజేశామన్నారు. ఇప్పటి వరకు 6,66,221 మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 951 కోట్ల 28 లక్షలు ఖర్చు చేశామన్నారు. 2021-22 సంవత్సరానికి కార్యాచరణ ప్రక్రియ …
Read More »