ఎన్నికలప్పుడు ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామన్న బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా అమలుకాని ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులిచ్చామని చెప్పారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభీ వాణీదేవి, మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి సనత్‌నగర్‌లోని …
Read More »బండి సంజయ్ కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బహిరంగ లేఖ
నర్సంపేటకు పట్టభద్రుల ఎన్నికలనగానే ఓటు అడగడానికి నర్సంపేటకు వస్తున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు.. బండి సంజయ్ ఏ మొహం పెట్టుకుని నర్సంపేటకు వస్తున్నావు. ఈ ప్రాంత రైతుల పొట్టకొడుతున్న మీరు ఇక్కడ ఓట్లడగటానికి అర్హులనుకుంటున్నారా? నర్సంపేట రైతుల 100 ఏండ్ల కల ఐన రామప్ప-పాకాల & రామప్ప- రంగాయ చెరువు ప్రాజెక్టులను అడ్డుకుని రైతుల ప్రయోజనాలపై దెబ్బకొట్టిన మీరు సిగ్గులేకుండా ఓటు …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు
కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »రాష్ట్ర ప్రజలకు బీజేపీ క్షమాపణ చెప్పాలి : మంత్రి కేటీఆర్
ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ఉసురు తీసి మరోవైపు ఉత్తరాల పేరుతో బీజేపీ డ్రామాలకు పాల్పడుతుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని …
Read More »టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ0 నుండి పోటీ చేస్తున్న మాజీ ప్రదాని పి.వి. నర్సింహరావు కుమార్తె సురభి వాణీ దేవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథ0 అన్నారు.శాంతి నగర్ లోని వడ్డేపల్లి మాజీ జడ్పిటిసీ శ్రీనివాసులు స్వగృహంలో టి ఆర్ ఎస్ నాయకులు మందా శ్రీనాథ్, వడ్డేపల్లి …
Read More »బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్ధాల జాతర
ఐటీఐఆర్ గురించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖ ఒక అబద్దాల జాతర అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంత్రి శ్రీ కేటీఆర్ అన్నారు. సిగ్గులేకుండా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే బీజేపీ నైజం మరోసారి బండి సంజయ్ లేఖ ద్వారా బయటపడిందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధిని పణంగా పెట్టి ఐటిఐఆర్ ని రద్దు …
Read More »తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. ఇక గతరాత్రి గం.8 వరకు రాష్ట్రంలో కరోనాతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు ఇప్పటివరకు రాష్ట్రంలో 1,635 మరణాలు సంభవించాయి. అటు ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులున్నాయి
Read More »జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో పెరిగిన భూగర్భ జలాలు
తెలంగాణలో గతేడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు పెరిగాయి. అత్యధికంగా సంగారెడ్డిలో 8.12 మీ., అత్యల్పంగా కరీంనగర్ జిల్లాలో (0.10 మీ.). పెరిగాయంది. ఇక 5 జిల్లాల్లో తగ్గుదల కన్పించిందని వెల్లడించింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 0.82 మీటర్లు తగ్గింది. సంగారెడ్డి, నిజామాబాద్ (తూర్పు), మెదక్, సిద్దిపేట, భద్రాద్రి నిర్మల్, కామారెడ్డి, వికారాబాద్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువ లోతుకెళ్తేనే నీటి జాడ ఉంటోంది.
Read More »కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా టీకా వేయించుకున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఆయ కొవార్టిన్ టీకా తొలిడోసు తీసుకోగా.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి… అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని కోరారు. ప్రధాని సహా ప్రముఖులందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆదర్శంగా నిలిచారని కిషన్ పేర్కొన్నారు.
Read More »