పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు అత్యవసర సమయాల్లో ఉపయోగించేందుకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ” GIFT A SMILE ” లో భాగంగా తన స్వంత డబ్బులతో అందించిన అత్యాధునిక అంబులెన్స్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ప్రారంభించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో అంబులెన్స్ ను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి పెద్దమనసుతో నియోజక …
Read More »మంత్రి కేటీఆర్‌ను కలిసిన అంశాల స్వామి.. నెరవేరనున్న సొంతింటి కల
నల్లగొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిశారు. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (సెలూన్) ని మంత్రి ఏర్పాటు చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లు నిర్మించి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం తరపున అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాల్సిందిగా …
Read More »ప్రగతి ఫలాల తెలంగాణ
వలసపాలన నుంచి విముక్తి చెంది తెలంగాణ ఆత్మనెరిగిన కేసీఆర్ నాయకత్వంలో 2014 జూన్ 2 నుంచి స్వయంపాలన మొదలైంది. తెలంగాణ అవసరాలు, కష్టాలు, సుఖాలు, నైసర్గిక స్వరూపం, వనరులు అన్నింటి గురించి క్షుణ్ణంగా ఎరిగిన ఆయన రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఓ పథకం ప్రకారం పనులు చేస్తున్నారు. తెలంగాణ సాధనకు టీఆర్‌ఎస్ ఏ ఎజెండాతో పదమూడేండ్లు నిర్విరామ పోరాటం చేసిందో ఆ ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం …
Read More »ఒలెక్ట్రా నుంచి పుణె నగరానికి మరో 350 ఎలక్ట్రిక్ బస్సులు
ఎలక్ట్రకి బస్సులు (ఈవి) వాహనాల తయారీలో అగ్రగామీగా ఉన్న మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపనీ మరో కీలకమైన ఆర్డర్ ను దక్కించుకుంది. పూణే మహానగర్ పరివహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంపీఎల్)కు మరో 350 ఎలెక్ట్రిక్ బస్సులను సరఫరా చేయనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు గురువారం (28.01.2021) ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ హితం కోసం కాలుష్యాన్ని తగ్గించే …
Read More »ఓటుకు నోటు కేసులో ఎంపీ రేవంత్ కు షాక్
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రేవంత్‌రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ రోజు శుక్రవారం కోర్టు విచారణ జరిపింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ …
Read More »తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగ ఖాళీలు
తెలంగాణ రాష్ట్రంలో 1,91,126 ఉద్యోగ ఖాళీలున్నాయని PRC నివేదికలో వెల్లడించింది. మొత్తం 4,91,304 పోస్టులకుగానూ ప్రస్తుతం 3,00,178 మంది(61%) పనిచేస్తున్నారు. మొత్తంలో ఖాళీలు 39%. 2011 జనాభా లెక్కల ప్రకారం TS జనాభా 3.5కోట్లు. ప్రతీ వెయ్యి మందికీ 14మంది ఉద్యోగులుండాలి. కానీ మంది మాత్రమే ఉన్నారు. TSలో 32 ప్రభుత్వ శాఖలుండగా వాటిలో విద్యాశాఖ, హోంశాఖ, వైద్య, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల్లోనే అత్యధికంగా ఉద్యోగులున్నారు
Read More »తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి శుభవార్త చెప్పారు అవసరమైతే రైతుల వద్ద నుంచి ప్రభుత్వమే మద్దతు ధరతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. నిన్న సిద్దిపేట జిల్లాలోని ఒంటిమామిడి మార్కెట్ యార్డ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ముఖ్య మంత్రి.. రైతుల నుంచి 4% మాత్రమే కమీషన్ తీసుకోవాలని ఏజెంట్లను ఆదేశించారు దేశవ్యాప్తంగా మద్దతు ధరపై ఆందోళనల నేపథ్యంలో సీఎం ప్రకటన రైతులకు భరోసా కల్పించనుంది
Read More »యాసంగి సీజన్లో పెరిగిన వరి సాగు విస్తీర్ణం
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. 2020తో పోల్చితే 9.88లక్షల ఎకరాలు పెరిగి 27.95 లక్షల ఎకరాలకు చేరింది. ఈ మేరకు వ్యవసాయశాఖ వెల్లడించింది. సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 22.19తో పోలిస్తే 25శాతం అదనంగా పెరిగినట్లు తెలిపింది. ఈ సీజన్లో వరి, శనగ, మినుము పొద్దు తిరుగుడు పంటలు అధికంగా వేశారు. అటు మరో ప్రధాన పంట వేరు శనగ విస్తీర్ణం …
Read More »తెలంగాణలో కొత్తగా 147 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 147 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,93,737కు పెరిగింది.మహమ్మారితో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకూ 1593 మంది చనిపోయారు. తాజాగా 399 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆరోగ్యవంతులైన వారి సంఖ్య 2,89,325కు చేరింది. ప్రస్తుతం 2,189మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా GHMC పరిధిలో 32, రంగారెడ్డి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి. 8 జిల్లాల్లో పాజిటివ్ కేసులు లేవు.
Read More »తెలంగాణలో వేరుశనగకు భారీగా ధర
తెలంగాణలో వేరుశనగ ధర భారీగా పెరిగింది. గద్వాల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ కు గరిష్ఠంగా రూ.8,376 ధర పలికింది. మద్దతు ధర రూ.5,225ను మించి ఉండటంతో రైతులు సంబరపడుతున్నారు. వనపర్తి మార్కెట్లో గత ఏడాది రూ.3,500 నుంచి రూ.5,000 లోపు ఉన్న వేరుశనగ ఈ ఏడాది ఏకంగా రూ.7,942 పలుకుతోంది. ఇక్కడి వేరుశనగకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంటుంది. గతేడాది భారీ వర్షాలతో దిగుబడి తగ్గడంతో రికార్డు స్థాయిలో ధరలు …
Read More »