పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను …
Read More »అద్భుతంగా పల్లె ప్రగతి : సీఎం కేసిఆర్
‘పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన నాడు …
Read More »ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.
ఇన్నాళ్లూ పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారు. ఉద్యోగుల పదోన్నతుల దస్త్రంపై సంతకం చేశారు. పదోన్నతుల కల్పనకు ఉద్యోగుల కనీస సర్వీసు సమయాన్ని ప్రభుత్వం కుదించింది. కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలోని వివిధ శాఖలు, కేటగిరీల్లో ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఇటీవల సీఎం ఆదేశించారు. …
Read More »గ్రేటర్ హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉచిత తాగునీటి పథకం ప్రారంభమైంది. రహ్మత్‌నగర్‌లోని ఎస్‌పీఆర్ హిల్స్‌లో ఈ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి జీరో నీటి బిల్లులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ మహముద్ అలీ, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ సీహెచ్ మల్లారెడ్డి, ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ మాగంటి గోపినాథ్, శ్రీ దానం నాగేందర్, …
Read More »ఈనెల 16 నుంచి తెలంగాణలో వ్యాక్సినేషన్
తెలంగాణలో ఈనెల 16 నుంచి కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. వ్యాక్సినేషన్ తర్వాత రియాక్షన్ ఉంటే వైద్య చికిత్స అందిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలకు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని చెప్పారు. వ్యాక్సిన్ వేయించే బాధ్యత సర్పంచ్‌లు, కార్యదర్శులు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. ముందుగా ఆశావర్కర్లు, వైద్య సిబ్బంది, పోలీసు, భద్రతా బలగాలకు టీకా వేయనున్నారు. ఆ తర్వాత 50ఏండ్లు పైబడిన, దీర్ఘకాలిక వ్యాధులతో …
Read More »బీజేపీ నేతలపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ అభివృద్ధిపై భాజపా నేతలు దేవాలయాల్లో ప్రమాణాలు ఆపేసి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందిస్తుందే తప్ప… పైసా సాయం చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు.
Read More »హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. నగరంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మాస్ మ్యూచువల్ సంస్థ ప్రకటించింది. అమెరికా వెలుపల రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read More »మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు బెయిల్ నిరాకరణ
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రవీణ్ రావు కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి,టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరించింది. సికింద్రాబాద్ కోర్టు. 3 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అనుమతించింది ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది అఖిలప్రియ. సీన్ రీ- కక్షతో పాటు, కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో కోర్టు బెయిల్ …
Read More »తెలంగాణలో కొత్తగా 351 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. …
Read More »ఎమ్మెల్సీ కవిత కు ‘వృక్ష వేదం’ పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్..
తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఈరోజు ఎమ్మెల్సీ కవితకు అందజేశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్.తెలంగాణలోని అడవులు, ప్రకృతి అందాల చిత్రాలతో కూడిన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని ఎమ్మెల్సీ కవితకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అందచేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణలో ఉన్న అడవులు మరియు చెట్లకు సంబంధించి వేదాలలో ఉన్న విషయాలను తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ పుస్తకాన్ని …
Read More »