దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ ,మంత్రి కేటీఆర్ తెలిపారు. తాము ఆశించిన విధంగా ఫలితాలు ఎందుకు రాలేదనే విషయంపై త్వరలోనే సమీక్షించుకుంటామన్నారు. సమీక్ష అనంతరం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయించుకుంటామన్నారు. దుబ్బాక ఫలితంతో అప్రమత్తం అవుతామన్నారు. తాము విజయాలకు పొంగిపోము, ఓటమికి కుంగిపోమన్నారు.
Read More »తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.
Read More »జవహర్‌నగర్‌లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్(వేస్ట్ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఘన …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-8వ రౌండ్ ముగిసేవరకు..!
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ఆధిక్యంలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం 200 అధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి చూస్తే మొదట ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉండగా.. ఆరో రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థే వరుసగా ఆధిక్యంలో ఉంటూ వస్తున్నారు.
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-6వ రౌండ్‌లో కారు జోరు
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ ఆరు రౌండ్ల పూర్తయ్యాయి. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరు రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే 2,667 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థే కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకూ 45,175 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. ఆరో రౌండ్ ఫలితాలు ఇలా.. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ రివర్స్
తెలంగాణలో ఈ రోజు విడుదలవుతున్నదుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల్లో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. కచ్చితంగా దుబ్బాక టీఆర్ఎస్‌దేనని అధిష్టానం, స్థానిక నేతలు భావించారు. అంతేకాదు.. మంత్రి హరీష్ రావు ఈ ఎన్నికను చాలా సీరియస్‌గా దగ్గరుండి మరీ చూసుకున్నారు. అయితే ఫలితాలకు వచ్చేసరికి పూర్తిగా తారుమారైంది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో తప్ప టీఆర్ఎస్.. రౌండ్లలో మాత్రం ఎక్కడా ఆధిక్యత చూపలేదు. ఇప్పటి వరకూ ఐదు రౌండ్లు పూర్తయ్యాయి. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు-4రౌండ్లో బీజేపీ జోరు
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ శరవేగంగా కొనసాగుతోంది. నాలుగో రౌండ్ కూడా ముగిసింది. వరుసగా నాలుగు రౌండ్లలోనూ బీజేపీయే తన హవాను కొనసాగిస్తోంది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామంలో బీజేపీ ఆధిక్యంలో ఉండటం విశేషం. ప్రభాకర్‌రెడ్డి స్వగ్రామమైన పోతారంలో 110 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. కాగా దుబ్బాకలో ఇప్పటి వరకూ దుబ్బాకలో 28,074 ఓట్ల లెక్కింపు పూర్తైంది. 2,684 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కొనసాగుతున్నారు. …
Read More »దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు- 3 రౌండ్‌లో ఆధిక్యంలో బీజేపీ
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింట్ ఈ రోజు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మూడు రౌండ్లలో జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో బీజేపీ 341, రెండవ రౌండ్‌లో 279, మూడో రౌండ్‌లో 750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. సుజాత ముందంజలో ఉంటారని అందరూ భావించినప్పటికీ బీజేపీ …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు: రెండు రౌండ్ లలో బీజేపీ ముందంజ …
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ సిద్దిపేటలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కింపు చేపట్టారు. అయితే తొలి రెండు రౌండ్ లలో బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు లీడ్ లో కొనసాగుతున్నారు. సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిపై 341 ఓట్లతో లీడ్ లో ఉన్నారు. రెండో రౌండ్ లో …
Read More »హైదరాబాద్ పేరును మారుస్తాం -ఎంపీ అర్వింద్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. కేంద్రం నిధుల విషయంలో మంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారు. రూ.224 కోట్లు ఇస్తే కనిపించడం లేదా? అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే మంత్రి కేటీఆర్ ను ఎవరూ పట్టించుకోరు. GHMC ఎన్నికల భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నసీఎం కేసీఆర్ పనిలో సోమరిపోతని విమర్శించారు.
Read More »