– ఫోన్ చేస్తే ఆరుగంటల వ్యవధిలో యూరియా అందుబాటులో ఉంచుతాం – శాసనసభ్యులు తమ నియోజకవర్గాలలో యూరియా కొరత ఉంటే కాల్ చేయండి – గత ఏడాదికన్నా 33.06 శాతం సాగువిస్తీర్ణం పెరిగినా ఎక్కడా యూరియా కొరత లేకుండా చేశాం – ఈ వానాకాలంలో ఇప్పటి వరకు 9.12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులో ఉంచాం .. ఇంకా లక్ష టన్నుల పై చిలుకు యూరియా కేంద్రం నుండి రావాల్సి ఉంది – …
Read More »తెలంగాణ అసెంబ్లీ వర్షకాలం సమావేశాల కుదింపుపై చర్చించిన మండలి చైర్మన్, స్పీకర్
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. సమావేశాలకు వస్తున్న సభ్యులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో వర్షాకాల సమావేశాలు కొనసాగించే అంశంపై చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో మండలి చైనర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. సమావేశాల కుదింపుపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయంపై మరోమారు పార్టీల అభిప్రాయం తీసుకువాలని నిర్ణయించారు.*
Read More »ఎనిమిదోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.
Read More »త్వరలో వార్డు ఆఫీసర్ పోస్టుల భర్తీ: మంత్రి కేటీఆర్
త్వరలోనే మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ నియామకాలు చేపడతామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మొదటి మూడేండ్లు ప్రొబేషనరీ కాలపరిమితి ఉంటుందని చెప్పారు. వార్డు ఆఫీస్ కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. కార్పొరేటర్, వార్డు ఆఫీసర్ కలిసి పనిచేస్తారని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకున్నా, రాష్ట్రప్రభుత్వం …
Read More »17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్
పదిహేడు మంది ఎంపీలకు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడంతో ఎంపీలకు కోవిడ్ పరీక్షలు అనివార్యం చేశారు. మీనాక్షి లేఖి, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేష్ సాహిబ్ సింగ్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఇతరుల్లో సుఖ్‌బీర్ సింగ్, హనుమాన్ బెనివాల్, ఎస్.మజుందార్, గొడ్డేటి మాధవి, ప్రతాప్ రావు జాదవ్, జనార్దన్ సింగ్, బిద్యుత్ బరణ్, ప్రదాన్ బారువా, ఎన్.రెడ్డప్ప, సెల్వం …
Read More »8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ ఎనిమిది బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ అసెంబ్లీ ఇవాళ ఆరవరోజు జరిగింది. ఈ సమావేశాల్లో భాగంగా 8 బిల్లులను ప్రవేశపెట్టగా మొత్తం బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. 8 బిల్లులు ఇవే.. 1) తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు- 2020కు అసెంబ్లీ ఆమోదం 2) తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు- 2020కు శాసన సభ ఆమోదం 3) తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ …
Read More »కొత్త రెవెన్యూ చట్టంపై శాసన మండలిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
కొత్త రెవెన్యూ చట్టంపై తెలంగాణ శాసనమండలిలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సుమారు అరగంటకుపైగా మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా వీఆర్వో వ్యవస్థను రద్దు చేశామని.. కోవిడ్ ప్రభావం వల్ల రెవెన్యూ చట్టం ఆలస్యమైందన్నారు. పాత రెవెన్యూ చట్టంతో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. పాత రెవెన్యూ చట్టంతో చాలా దారుణాలు చూశామని.. వీఆర్వోల విశేషాధికారాలతో చాలా మంది నష్టపోయారని కేసీఆర్ తెలిపారు. మోదీ ప్రభుత్వం నష్టం …
Read More »గుండెపోటుతో తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు మృతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అల్వాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారెడ్డి గుండెపోటుతో శుక్రవారం మరణించారు. విషయం తెలుసుకున్న మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నందికంటి శ్రీధర్‌తో పాటు పలువురు ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ నరసింహారెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
Read More »కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి కరోనా నెగెటివ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డికి కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. ఈ నెల 14 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనుండడంతో కిషన్‌రెడ్డి గురువారం కరోనా పరీక్ష చేయించుకున్న విషయం తెలిసిందే.
Read More »తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి …
Read More »