Home / TELANGANA (page 493)

TELANGANA

శ్రీశైలం జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్నిప్రమాదం

శ్రీశైలంలోని భూగర్భ జల విద్యుత్తు‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్తు‌ కేంద్రంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. ప్రమాదంలో 9 మంది సిబ్బంది విద్యు‌త్తు కేంద్రంలోనే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్తు‌ ఉత్పత్తి నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. విద్యుత్తు‌ కేంద్రంలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని జెన్‌కో సీఈ సురేష్‌ తెలిపారు. విద్యుత్తు‌ కేంద్రంలో మూడు చోట్లు అత్యవసర దారులున్నాయని.. వాటి ద్వారా వారు …

Read More »

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …

Read More »

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, …

Read More »

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా

ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనావైర‌స్.. తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను వెంటాడుతూనే ఉంది.. ఇప్ప‌టికే హోంమంత్రి, మంత్రులు, డిప్యూటీ స్పీక‌ర్, ప‌లువురు ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు.. ఇలా చాలా మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు.. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే సురేంద‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఇవాళ ఆయ‌న క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. దీంతో.. అపోలో ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక‌, మూడు, నాలుగు రోజుల క్రితం కూడా ఆయ‌న …

Read More »

వరంగల్ లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరుసగా కురిసిన వర్షాల వల్ల ఓరుగల్లు నగరం జలమయం కావడంతో అక్కడి పరిస్థితులను ను సమీక్షించడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఓరుగల్లు నగరం లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖల మంత్రి శ్రీ కేటీఆర్, వైద్య – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ ఈటెల రాజేందర్, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, …

Read More »

అక్రమ నిర్మాణాలతోనే వరంగల్ కు ముంపు సమస్య

వరంగల్ అర్బన్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్, సహచర మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి వరంగల్ నగరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా వీక్షించారు. అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానంలో దిగారు. అక్కడి నుంచి నయీం నగర్, కేయూ 100ఫీ ట్ రోడ్ మొదలైన వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. స్థానిక ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. …

Read More »

తెలంగాణలో కరోనా తగ్గుముఖం

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌కార్పొరేషన్‌ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. …

Read More »

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో 1,102 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖహెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే 1,903 మంది కరోనా నుండి కోలుకున్నారు. 9మంది కరోనా వల్ల మృతి చెందినట్లు బులిటెన్లో వెల్లడించింది.మరోవైపు గడిచిన 24 గంటల్లో 12,120 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వివరించింది. దీంతో మొత్తం 91,361 కు కరోనా కేసుల సంఖ్య చేరుకుంది. అందులో మొత్తం 22,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు …

Read More »

ప్రగతి భవన్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాద్లోని ప్రగతి భవన్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. దేశానికి వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ …

Read More »

తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం

 తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా… 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్‌ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat