Home / TELANGANA (page 513)

TELANGANA

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం

తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పాజిటివ్‌ పేషెంట్లు ఇంట్లోనే చికిత్స తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా పేషంట్లకు జిల్లాల్లోనే చికిత్స, జిల్లా కేంద్రాల్లో ఐసోలేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. హోంక్వారంటైన్‌లో ఉండేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ప్రజల్లో ఉన్న భయం వారిని ఆస్పత్రి నుంచి బయటికి రానివ్వడం లేదన్నారు. ఇంట్లో ప్రత్యేక గది లేనివారు ఆస్పత్రిలోనే ఉండాలని కోరుకుంటున్నారని, …

Read More »

కాళేశ్వరం డ్యాష్‌బోర్డు

ఒక ప్రాజెక్టు నిర్వహణ కోసం ప్రణాళిక అవసరం. అదే అనేకప్రాజెక్టుల సమాహారంగా రూపుదిద్దుకున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్వహణకు కేవలం ప్రణాళిక సరిపోదు. అందుకు భారీవ్యూహం కావాలి. అటు ప్రధాన గోదావరి.. ఇటు ప్రాణహిత.. నడుమ కడెం.. ఎప్పుడు వరద ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. వర్షపాతం, వరద రాకను ముందే పసిగట్టాలి. రోజుకు 2-3 టీఎంసీల జలాలను ఎత్తిపోసే అనేకదశల్లో ఉన్న భారీమోటర్లను సక్రమంగా నిర్వహించాలి. ఎక్కడ ఏ …

Read More »

కరోనాతో టీవీ 5 జర్నలిస్టు మృతి

కరోనా మహమ్మారితో టీవీ 5 న్యూస్‌చానల్‌ జర్నలిస్టు దడిగె మనోజ్‌కుమార్‌ (33) మృతిచెందారు. గాంధీ దవాఖానలో చికిత్సపొందుతూ ఆదివారం ఉదయం చనిపోయారు. యువ జర్నలిస్ట్‌ మనోజ్‌కుమార్‌ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌ మాదన్నపేటకు చెందిన మనోజ్‌కుమార్‌ కొన్నేండ్లుగా టీవీ 5 న్యూస్‌చానల్‌ క్రైమ్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఎనిమిది నెలల కిందటే సైదాబాద్‌కు చెందిన యువతితో వివాహం కాగా, ప్రస్తుతం …

Read More »

కరోనా ఆసుపత్రిగా నిమ్స్

తెలంగాణలో కరోనా కేసులు రాష్ట్రంలో నమోదవడం మొదలైనప్పటినుండి, అంటే దాదాపుగా మూడునెలలుగా గాంధీ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో మరెక్కడా చికిత్స లేకపోవడం, కేవలం గాంధీ మాత్రమే అందుబాటులో ఉండడం అన్ని వెరసి వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిమ్స్ ను కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక్కడ రెండు వందల పడకలను …

Read More »

కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్‌ బీమా అందజేత

టీఆర్‌ఎస్‌ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన పోతరాజు అఖిల్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడికి ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీశ్‌ నేడు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

మీరా చోప్రా ఫిర్యాదు…మంత్రి కేటీఆర్ స్పందన ఇదే..!!

సోషల్‌ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల సమస్యపై ట్విట్టర్‌లో కేటీఆర్‌కు ఫిర్యాదు చేసింది నటి మీరా చోప్రా. గత కొద్ది రోజులుగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు తనపై అసభ్యకర కామెంట్లు, ట్వీట్లు చేస్తున్నారని మీరా చోప్రా ఫిర్యాదు చేసింది. ఈ విషయమై హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకువెళ్ళింది. తన ట్వీట్‌లో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పిస్తారని నమ్ముతున్నానని మీరా చోప్రా …

Read More »

పాముల పార్కు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. అనంత‌రం ఆయన …

Read More »

జూన్ 8 నుంచి భక్తులకు ద‌ర్శ‌నాలు..మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తెలంగాణ‌లోని ఆలయాల్లోకి భక్తుల రాకను పునరుద్ధరించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు దేవాదాయ శాఖ అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. భక్తుల ద‌ర్శ‌నాల‌కు ఆలయాలు తెరిచే విషయమై శుక్ర‌వారం అర‌ణ్య భ‌వ‌న్ లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి దేవాదాయ శాఖ అధికారుల‌తో స‌మీక్షించారు. దేవాలయాల పునః ప్రారంభానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ (ఎస్‌ఓ‌పి)ను అధికారులతో చర్చించారు. భక్తులకు …

Read More »

ఏటా నియంత్రితసాగు అలవాటుగా మారాలి..సీఎం కేసీఆర్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల …

Read More »

నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!

హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా వైరస్ బారినపడగా తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat