రాజేంద్రనగర్ లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీని ఉపయోగించాలని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాలలో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ …
Read More »ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్
లాక్‌డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 29 నుంచి …
Read More »వేలకోట్ల ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యం
కరోనా వచ్చిన రోజు నుండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు రాజకీయాలు పక్కనపెట్టి అత్యంత భాద్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. వేలకోట్ల ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ప్రాణాలు ముఖ్యమని లాక్ డౌన్ ను తు చ తప్పకుండా పాటిస్తున్నాం. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ప్రధాన మంత్రిని విమర్శిస్తుంటే ఇప్పుడు రాజకీయం చేయవద్దని వారించిన వ్యక్తి మన సిఎం గారు అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి …
Read More »లైసెన్స్ లేని మటన్ షాపులపై చర్యలకు మంత్రి ఆదేశం
హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలపై తనిఖీలు నిరంతరం కొనసాగించాలని, లైసెన్స్ లేని షాపులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. మాసాబ్ ట్యాంకులోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆ శాఖ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాంసం దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై …
Read More »లేబర్ డే.. వలస కూలీల్లో చిరునవ్వులు నింపిన తెలంగాణ
లేబర్ డే… కార్మిక దినోత్సవం.. కానీ మహమ్మారి కరోనా.. కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో శ్రామిక వర్గం తీవ్ర అవస్థలు అనుభవిస్తున్నది. వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులను అక్కున చేర్చుకున్నది. వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించింది. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి ఎటువంటి లోటు రాకుండా చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమలులో …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు..
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు పారిశుద్ధ్య కార్మికులు అవిశ్రాంతంగా పని చేస్తున్నారు. కరోనా వైరస్‌పై వీధుల్లో పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తుంటే.. ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు యుద్ధం చేస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో ముందు వరుసలో ఉండి యుద్ధం చేస్తున్న జీహెచ్‌ఎంసీతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ పేజీలో ఓ వీడియోను షేర్ చేశారు. …
Read More »పునర్జన్మనిచ్చిన తెలంగాణ-వృద్ధుడు
కూతురిని చూసేందుకు అమెరికా వెళ్లొచ్చిన వృద్ధ దంపతుల్లో భర్తకు కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. 70 ఏండ్ల వయస్సులో మహమ్మారి బారినుంచి బయటపడటం, ప్రభు త్వం చేపట్టిన చర్యల ఫలితమేనని ప్రశంసించారు. గాంధీ దవాఖానలో సేవలను కొనియాడిన ఆయన, తెలంగాణ ప్రభుత్వం తనకు పునర్జన్మనిచ్చిందని కితాబిచ్చారు. అమెరికాలో వైరస్ విజృంభణను, హైదరాబాద్‌లో చికిత్సను ప్రత్యక్షంగా చూసిన ఆయన తన మనోగతాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకొన్నారు. ‘గత ఏడాది చివరలో అమెరికాకు వెళ్లాం. …
Read More »40 లక్షల టన్నుల సామర్థ్యం ఉండేలా 8 నెలల్లో కొత్త గోదాములు
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి పెరుగుతున్నందున రికార్డు స్థాయిలో వరిసాగు జరుగుతున్నదని, తెలంగాణ రాష్ట్రం ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ గా మారుతున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దిగుబడి పెరుగుతున్నందున, పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్రవ్యూహాన్ని ఖరారుచేస్తున్నట్లు వెల్లడించారు. అదనంగా మరో 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు, 2500 రైతు వేదికలు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రైతుబంధు సమితులను క్రియాశీలం చేసేందుకు …
Read More »ఐసీఎంఆర్ ప్రకారమే పరీక్షలు.. ప్రైవేట్ ల్యాబ్‌లను అనుమతించేది లేదు
రాష్ట్రంలో కరోనా పరీక్షలకు సంబంధించి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడిచేసేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలపై కేంద్రం సంపూర్ణ విశ్వాసం వ్యక్తంచేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంత పారదర్శకంగా పనిచేస్తుంటే విమర్శలు చేయడమేమిటని మండిపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నిర్ధారణ పరీక్షలకోసం ప్రైవేట్ ల్యాబుల్లో పరీక్షలకు …
Read More »రంగనాయక్ సాగర్ కు నేడు కాళేశ్వర నీళ్లు
కాళేశ్వర ప్రాజెక్టు మహోజ్వల ప్రస్థానంలో మరో కీలక ఘట్టం ఆవిష్కారమవుతున్నది. నాలుగేండ్ల క్రితం మేడిగడ్డ వద్ద వెనుకకు అడుగులు వేయడం మొదలుపెట్టిన గోదావరి.. రంగనాయకసాగర్‌లో కాలుమోపడంతో సప్తపదులు పూర్తిచేసుకోనున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి ఆరోదశ ఎత్తిపోతతో అన్నపూర్ణ జలాశయాన్ని చేరుకున్న గోదావరిజలాలు.. రంగనాయకసాగర్‌లోకి వస్తున్నాయి. పది దశల ఎత్తిపోతలలో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. శుక్రవారం చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ …
Read More »