రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌కు గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన ప్రత్యేక విందు కార్యక్రమం ప్రారంభమైంది. తొలిసారి రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం కాసేపు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలను ట్రంప్ పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్‌తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కరచాలనం చేశారు. …
Read More »రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. తెలుగురాష్ట్రాలనుంచి ఆరుగురు రిటైర్ !
ఏప్రిల్ నెలలో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకెళ్లనున్నారు. మధ్యాహ్నాం పూట బేగంపేట ఎయిర్ పోర్టు నుండి ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు పోచంపల్లి శాలువా కప్పి .. చార్మీనార్ మెమెంటో ఇవ్వనున్నారు. మెలానియా,ఇవాంకలకు ప్రత్యేకంగా …
Read More »బల్దియా అంటే ఖాయా.. పీయా.. చల్దియా కాదని నిరూపిద్దాం
రాష్ట్రంలో అన్నిరకాల ఎన్నికలు ముగిశాయి.. వచ్చే నాలుగేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు లేవు.. ఇక మా దృష్టంతా అభివృద్ధిపైనే’ అని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు. పార్టీలకతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. బాగా పనిచేసి ప్రజల మనసులు గెలుచుకోవడమే ప్రధాన ఉద్దేశమని.. తమకెలాంటి రాజకీయ ఉద్దేశాలు, ఆపేక్షలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పట్టణప్రగతి’ కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు …
Read More »ఇళ్లు ఎంత ముఖ్యమో…గల్లీ అంతే ముఖ్యం..
సంగారెడ్డి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ప్రారంభించారు. సంగారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డులోని నారయణ రెడ్డి కాలనీని సందర్శించారు. వీధి వీధి తిరుగుతూ… కాలనీ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను చెత్త బండి వస్తూందా లేదా అని మంత్రి అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు వస్తోందని… మహిళలు చెప్పడంతో… మంత్రి హరీశ్ రావు…మున్సిపల్ కమిషనర్ ను పిలిచి చెత్త సేకరణ ఎలా …
Read More »ట్రంప్ దంపతులకు సీఎం కేసీఆర్ కానుకలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులతోపాటు కూతురు ఇవాంకకు సీఎం కేసీఆర్ కానుకలు అందించనున్నారు. నేడు రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా కోవింద్ ట్రంప్ గౌరవార్థా విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి కోవింద్ స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పంపించిన సంగతి తెలిసిందే . ఈ విందుకు ప్రత్యేక ఆహ్వాని తుడిగా కేసీఆర్ హాజరుకాను న్నారు. ఇందుకోసం ఆయన …
Read More »మహబూబ్‌నగర్‌లో పట్టణ ప్రగతికి శ్రీకారం.. మంత్రి కేటీఆర్ పాదయాత్రకు అపూర్వ స్పందన..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ మహబూబ్‌నగర్ పట్టణంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఓ ఇంటి ముందు అరుగుపై కూర్చున్న వృద్ధులతో కేటీఆర్ ముచ్చటించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? …
Read More »ఎమ్మెల్యే రోజా గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన మంత్రి అనిల్‌కుమార్..!
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. కేంద్ర మంత్రులు, కోహ్లీ, సింధూ, కీర్తి సురేష్, కాజల్ వంటి సినీ సెలబ్రిటీలు, పలువురు రాజకీయ నాయకులు, ఐఏఏస్, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్ని మొక్కలు నాటున్నారు. తాజాగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విసిరిన గ్రీన్‌ఛాలెంజ్‌ను స్వీకరించిన ఏపీ మంత్రి …
Read More »వారి ఆశీస్సులతోనే మంత్రినయ్యా.. మంత్రి సత్యవతి రాథోడ్
ఊరి జాతర అంటే ఉండబట్టలేని ఆనందం. జాతరకు వెళ్లాలనే ఆత్రం. జాతరలో పేలాలు, బొమ్మలు కొనడంలో ఉండే ఆనందం వేరు. ఊరి నుంచి ఎదిగి ఎంత ఉన్నత స్థాయికి వచ్చినా…ఊరికి వస్తే ఒదిగిపోవాల్సిందే… ఆ జాతర జ్ణాపకాల్లో తేలిపోవాల్సిందే…సరిగ్గా ఇదే దృష్యం కురివి శ్రీ వీరభద్ర స్వామి జాతరలో నేడు ఆవిష్కారమైంది. ఆమె రాష్ట్రానికి మంత్రి. కానీ వీరభధ్ర స్వామి జాతరకు చేరుకుని, స్వామిని దర్శించుకునేంత వరకే అలా ఉన్నారు. …
Read More »వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి అల్లోల
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సమేతంగా మంత్రి అల్లోల స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలను అందించారు. శివరాత్రి మహోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. …
Read More »