తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …
Read More »తెలంగాణ అమ్మాయి మరో ఘనత
తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ మరో ఘనతను సొంతం చేసుకుంది. అంటార్కిటికా ఖండంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విన్సన్ మసీఫ్ పర్వతాన్ని పూర్ణ అధిరోహించింది. ఈ నెల ఇరవై ఆరో తారీఖున విన్సన్ పర్వతంపై పూర్ణ భారత జాతీయ జెండాను ఎగురవేసింది. విన్సన్ మసిఫ్ పర్వతం ఎత్తు మొత్తం 16050అడుగులు. గతంలో 2019లోనే సౌత్ అమెరికాలోని అంకాకాగ్వా పర్వతం,ఓసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాన్ని మలావత్ …
Read More »అమెరికాలో తెలంగాణ యువతి మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …
Read More »గ్రీన్ ఛాలెంజ్లో తెలంగాణ రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా బృహత్తర కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టిన తరుణంలో ఇప్పటికే నాలుగు కోట్ల వరకు మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. మొక్కలు లేనిదే మానవజాతి మనుగడ లేదని కాబట్టి మొక్కలు నాటడమే కాకుండా పెంచడం కూడ ఒక సామాజిక బాధ్యత గా తీసుకోవాలి పిలుపునిచ్చారు . హరిత …
Read More »ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..
తుల ఇంట్లో సంపద పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని,అందులో భాగంగానే మొదటగా పైలెట్ ప్రాజెక్టు పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా రూ.7 కోట్ల 4 …
Read More »మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకు కారణం అవే
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్ పల్లిలో దుండిగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మంత్రి చెరుకు మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ” తెలంగాణ …
Read More »వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు…!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ వేములవాడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంట …
Read More »కాళేశ్వరంపై గవర్నర్ తమిళిసై ప్రశంసలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్ కృషి అద్భుతమన్నారు. పర్యావరణాన్ని పాడుచేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో 34 వ ఇండియన్ ఇంజనీర్స్ కాంగ్రెస్ కు గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సహజ వనరులు కాపాడుకుంటూ రాబోయే భావి తరాలకు.. చక్కని ఎకో సిస్టమ్ అందివ్వాల్సిన బాధ్యత మనపై …
Read More »జనవరి 2 నుండి 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం..మంత్రి ఎర్రబెల్లి
జనవరి 2 నుండి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహించే 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి తో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …
Read More »మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం.. మంత్రి కేటీఆర్
తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్ఎస్ పార్టీ అవతరించిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లో విజయం …
Read More »