సిద్దిపేట నియోజకవర్గం ప్రాచీన కోవెలలకు కొలువైనది అని..నియోజకవర్గం లోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చామని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో వెలసియున్న శ్రీ శరబెశ్వర ఆలయ 83 వ వార్షికోత్సవం లో పాల్గొని స్వామి వారి రుద్రాభిషేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ.. గొప్ప ప్రాశస్త్యం..చారిత్రాత్మక ఆలయాలకు నెలవు మన సిద్దిపేట అని..ఎన్నో …
Read More »నేడు కేరళ వెళ్లనున్న సీఎం కేసీఆర్..!!
టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు త్రివేంద్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తో సమావేశమవుతారు. ప్రస్తుత రాజకీయ స్థితులపై ఇద్దరు చర్చిస్తారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారు. ముఖ్యమంత్రి కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను సందర్శిస్తారు.
Read More »ఆస్పత్రినుంచి గాయని జానకి డిశ్చార్జి..
ప్రముఖ గాయని ఎస్.జానకి కాలి గాయం నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మైసూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 3 రోజులుగా చికిత్స పొందిన ఆమె, ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. వైద్యులు ఆమెను 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారు. ఓ శుభకార్యం కోసం మైసూరులో బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అక్కడే ప్రమాదవశాత్తూ కాలుజారిపడ్డారు. కాలు మడత పడ్డంతో కీలు పూర్తిగా దెబ్బతింది. తుంటికి కూడా …
Read More »ప్రతిపక్షాల శవ రాజకీయలకు, పచ్చ మీడియా చెత్త రాతలకు చెక్ పెట్టిన ఇంటర్ బోర్డు..!!
గత కొన్ని రోజులక్రితం వెలువడిన ఇంటర్ ఫలితాల విషయంలో కొద్దిమంది విద్యార్థులకు సంబంధించి జరిగిన సాంకేతిక తప్పిదాలను బూచిగా చూపి, మొత్తం అందరు విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు పచ్చమీడియా, కార్పొరేట్ శక్తులు చిత్రీకరించాయి. ఇదే అదనుగా ప్రజాధారణ లేని ప్రతిపక్షాలు రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టాయి. 16 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ బోర్డు, ప్రభుత్వ వైఫల్యమే కారణమని శవ రాజకీయాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం …
Read More »గుండెజబ్బు బాధితుడికి అండగా కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు. గుండె జబ్బుతో బాధ పడుతున్న యువకుడికి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన బి నవీన్ గౌడ్ కారు నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి …
Read More »తెలంగాణలో రేపే “తొలి”విడత స్థానిక సంస్థల సమరం
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రేపు అనగా సోమవారం రాష్ట్రంలోని 197 మండలాల్లోని జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది.ఈ క్రమంలో ఆయాస్థానాల్లో ఎన్నికల ప్రచారం నిన్న శనివారం సాయంత్రం 5.00గంటలకుముగిసింది. తొలివిడుతలో మొత్తం 197 జెడ్పీటీసీ, 2,166 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో రెండు జెడ్పీటీసీ, 69 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో రేపు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం …
Read More »గులాబీ సైనికులకు సీఎం కేసీఆర్ పిలుపు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపటి నుండి జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎంతో పట్టుదలతో పని చేసి పార్టీ తరపున బరిలోకి దిగుతున్న జెడ్పీటీసీ,ఎంపీటీసీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఈ నెల ఆరో తారీఖు నుండి జరగనున్న తొలి దశ ఎన్నికల నుండే పార్టీ నేతలు,కార్యకర్తలు ఎంతో అప్రమత్తంగా ఉండి.. విపక్షాలకు …
Read More »టీఆర్‌ఎస్‌తోనే గ్రామాలాభివృద్ధి సాధ్యం
గ్రామాల అభివృద్ధి కేవలం టీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని, అందుకే టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాలు మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా శనివారం మామడ మండలంలోని కొరిటికల్, పోతారం, అనంతపేట, పొన్కల్ గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో చేపట్టిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. …
Read More »మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పథకాల అమలుపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అన్నారు. శనివారం కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రవీంద్ర పవార్ సి.యస్ సమక్షంలో రాష్ట్రంలో కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ కు సంబంధించిన పథకాల అమలు తీరుపై సమీక్షించారు.ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ …
Read More »రాళ్ల దాడిపై స్పందించిన ఎమ్మెల్యే హరిప్రియ..!!
ఈరోజు ఉదయం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై కామేపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి పై ఆమె స్పందించారు. ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి అని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ …
Read More »