Home / Uncategorized

Uncategorized

పవన్ అభిమానులకు శుభవార్త

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్‌’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …

Read More »

హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం  కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 

Read More »

ఉద్యోగం కావాలని ట్వీట్ చేసిన జాతి రత్నాలు “హీరో”

స్క్రీన్ రైటర్‌గా కెరియర్ స్టార్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. చిన్న చిన్న పాత్రల చేస్తూ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో హీరోగా మారాడు. ఇక రీసెంట్‌గా జాతి ర‌త్నాలు చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాడు. ప్రేక్ష‌కులు, సినీ సెల‌బ్రిటీలు,రాజ‌కీయ నాయ‌కులు కూడా ఈ సినిమాకి ఫిదా అయ్యారు. అయితే న‌వీన్ న‌టుడిగానే కాకుండా మాన‌వ‌తా వాదిగాను నిరూపించుకుంటున్నాడు. క‌రోనా కార‌ణంగా ఎంద‌రో ఉద్యోగాలు కోల్పోయారు. పొట్ట‌కూటి కోసం బండ్ల‌పై …

Read More »

ప్రధాని మోదీ బొమ్మంటే మాజీ మంత్రి ఈటలకు భయమా..?

ఆస్తులను కాపాడుకోవడానికి కాషాయ కండువా కప్పుకొన్న ఈటలకు మోదీ బొమ్మంటేనే జడుపు, జ్వరం పట్టుకొన్నది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్రలో ఏ మూలన కూడా మోదీ బొమ్మ కనపడనివ్వవద్దని తన అనుచరులను మాజీ మంత్రి  ఈటల రాజేందర్ ఆదేశించినట్టు సమాచారం. మోదీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తన పాదయాత్రలో.. భవిష్యత్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ బొమ్మ పెట్టుకొంటే వచ్చే …

Read More »

సంక్రాంతికి పవన్ కొత్త మూవీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి రానా హీరోలుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సరికొత్త మూవీ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మంగళవారం చిత్రం యూనిట్ విడుదల చేసిన ఈ మూవీ మేకింగ్ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాల్లో …

Read More »

మహబూబాబాద్ లో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన  టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును మహబూబాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయర్‌తో, మున్సిపల్‌ చైర్మన్‌ పాల్వాయి రామ్మోహన్‌ రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సద్గురు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, …

Read More »

కూకట్ పల్లిలో ఘనంగా మంత్రి కేటీఆర్ బర్త్ డే వేడుకలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని..కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు.. కూకట్పల్లి టిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..mlc నవీన్ కుమార్ హాజరయ్యి ప్రారంభించడం జరిగింది.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో కరోనా వైరస్ విజృంభించి ఆక్సిజన్ మరియు రక్తం దొరకక చాలా …

Read More »

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ-ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర,ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. గత 26 సంవత్సరాలుగా తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తున్నానని పేర్కొన్నారు. ఇంకా ఆయనకు 6 సంవత్సరాల సర్వీస్ ఉంది.  కొన్ని రోజుల క్రితం ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఓ …

Read More »

మంత్రి కేటీఆర్ ని కలిసిన వేములవాడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్రంలోని వేములవాడ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు ఈ రోజు మంత్రి కే తారకరామారావుని ప్రగతి భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన విజ్ఞప్తులను మంత్రి కేటీఆర్ కి అందించారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ గారి సూచన మేరకు కథలాపూర్ నియోజకవర్గంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …

Read More »

30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

టీమిండియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న చివరి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పడం లేదు. 30 పరుగులకే ఆ జుట్టు 3 వికెట్లు కోల్పోయింది. సిబ్లీ (2), క్రాలే (9)ను అక్షర్ పటేల్ పెవీలియన్‌కు పంపగా.. రూట్ (5)ను సిరాజ్ ఔట్ చేశాడు. మూడో టెస్టు తరహాలోనే ఈ టెస్టు కోసం కూడా పిచన్ను స్పిన్ కు అనుకూలంగా తయారుచేయించినట్లు కన్పిస్తోంది

Read More »