ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన అమెజాన్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టడంతో రాష్ట్రంలోని పారిశ్రామికవర్గాల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి వచ్చిన చరిత్ర లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఓ విదేశీ కంపెనీ తెలంగాణలో భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడంపై పరిశ్రమవర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రాకతో తెలంగాణ ఇకపై డాటా సెంటర్ హబ్‌గా మారుతుందని …
Read More »Blog Layout
సీఎం కేసీఆర్‌ను కలిసిన చిరంజీవి, నాగార్జున
తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తున్నది. భవిష్యత్తు తరాల అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించుకునేందుకు ఫిల్మ్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను నిర్మించనున్నది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి సీఎం …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన ఈసారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్‌ఎస్ కార్యాలయ భవనం కోసం 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ స్థలాన్ని చదును చేసే పనులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. …
Read More »పవన్ తో శృతిహాసన్
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌కి జంటగా శ్రుతీ హాసన్ వకీల్ సాబ్ చిత్రంలో సందడి చేయనున్నసంగతి విదితమే. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. అయితే… ఇప్పటివరకూ శ్రుతి సెట్స్‌కి రాలేదు. డిసెంబర్‌లో ‘వకీల్ సాబ్’తో కలిసి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పవన్, ఇతర తారాగణంపై తెరకెక్కిస్తున్న సన్నివేశాల చిత్రీకరణ ఈ నెలలో పూర్తవుతుందట. వచ్చే నెలలో హీరో హీరోయిన్లపై …
Read More »జీడిమెట్లలో రీసైక్లింగ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
జీడిమెట్లలో భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్‌ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ఉదయం ప్రారంభించారు. భవన నిర్మాణ వ్యర్థాలకు చెక్ పెట్టేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 500 టీపీడీ సామర్థ్యం కలిగిన రీసైక్లింగ్ ప్లాంట్‌ను నిర్మించింది. రూ. 10 కోట్లతో కన్‌స్ర్టక్షన్ అండ్ డిమాలిషింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇసుక, కంకరను వివిధ సైజుల్లో వేరు చేసేలా రీసైక్లింగ్ …
Read More »రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడకల ఇండ్ల పథకానికి మరోసారి విశిష్ఠ గుర్తింపు లభించింది. కొల్లూరు-2లో నిర్మించిన రెండు పడకల ఇండ్ల కాలనీకి పట్టణ నిరుపేద గృహాలు, మౌలిక వసతుల పథకం కింద జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీలో బెస్ట్ ప్రాక్టీస్ అవార్డు లభించింది. శుక్రవారం హైదరాబాద్‌లో హడ్కో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం సంయుక్త జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) మురళీకృష్ణ …
Read More »డబుల్ డెక్కర్ బస్సులపై మంత్రి కేటీఆర్ ట్వీట్
ఒకప్పుడు భాగ్యనగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగెడుతుంటే చూడముచ్చటగా ఉండేది. నిజాం కాలంలో ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సులు కాలక్రమేణా కనుమరుగై పోయాయి. అయితే షాకీర్ హుస్సేన్ అనే యువకుడు డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేస్తూ ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబర్‌తో నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, …
Read More »తెలంగాణలో 1,607 కొత్త కరోనా కేసులు
తెలంగాణలో గత నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,607 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,48,891కి చేరింది. 1,372 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 19,936 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2,27,583 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన హెల్త్ …
Read More »తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
తనను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టిన తెలుగు చిత్రపరిశ్రమపై పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది వాళ్లు నడుం మత్తులో ఉంటారనీ, మిడ్ డ్రెస్‌లలోనే నాయికల్ని చూడాలనుకుంటారనీ శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పూజ చెప్పారు. హీరోలకు సమానంగా హీరోయిన్లకు పారితోషికం ఇవ్వాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు నెట్టింట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. దక్షిణాది సినిమాల వల్ల హీరోయిన్‌గా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న పూజ ఇలా మాట్లాడడం …
Read More »రూపం మార్చుకున్న కరోనా వైరస్
కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్ మున్సిపాలిటీల్లో కొత్త ఆంక్షలను …
Read More »