rameshbabu
August 10, 2020 SLIDER, TELANGANA
523
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 389 ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 80,751కి చేరాయి. వైరస్ ప్రభావంతో మరో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 637కి చేరింది. ప్రస్తుతం 22,528 మంది బాధితులు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజు 11,609 …
Read More »
rameshbabu
August 10, 2020 MOVIES, SLIDER
789
లాక్‌డౌన్ సమయంలోను వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ అందరికి షాకిస్తున్న రామ్ గోపాల్ వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కోవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ ఓ వెబ్‌సైట్ రాసుకొచ్చింది. దీనిపై తనదైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వర్మ సదరు వెబ్‌సైట్‌కి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో డంబెల్ ఎత్తి కసరత్తులు చేస్తున్న వీడియోని పోస్ట్ చేస్తూ.. నాకు తీవ్ర జ్వరం …
Read More »
rameshbabu
August 10, 2020 NATIONAL, SLIDER
682
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల …
Read More »
rameshbabu
August 10, 2020 MOVIES, SLIDER
745
తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. …
Read More »
rameshbabu
August 10, 2020 SLIDER, SPORTS
1,286
చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. …
Read More »
rameshbabu
August 10, 2020 SLIDER, TELANGANA
648
మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు …
Read More »
rameshbabu
August 10, 2020 SLIDER, TELANGANA
583
తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు …
Read More »
rameshbabu
August 9, 2020 SLIDER, TELANGANA
711
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ గాయని స్మిత ఇచ్చిన చాలెంజ్ ను స్వీకరించి నేడు గోవిందరావుపేట మండలం గోతుకోయ గ్రామంలో అటవీ ప్రాంతంలో గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ అడవిబిడ్డల గా మేము అమ్మానాన్నల తర్వాత అత్యంత ఇష్టంగా ప్రేమించేది అడవులని ఈ అడవుల ద్వారా మాకు …
Read More »
rameshbabu
August 9, 2020 MOVIES, SLIDER
793
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్, నటి జ్యోతిక మరోసారి ఆదర్శంగా నిలిచారు.తంజావూర్ ప్రభుత్వాస్పత్రికి రూ. 25 లక్షలు విరాళం అందించారు. ఆ మధ్య తాను నటిస్తున్న చిత్ర షూటింగ్ కోసం రాజా మీరసుధార్ ఆస్పత్రికి వెళ్లి అక్కడి సమస్యలను చూశారు. ఈ క్రమంలో శనివారం ఉదయం అగరం ఫౌండేషన్ ద్వారా ఆస్పత్రి అభివృద్ధికి విరాళాన్ని జ్యోతిక తరఫున దర్శకుడు ఆర్.శరవణన్ అందించారు. పిల్లల వార్డు ఆధునికీకరణ కోసం ఈ …
Read More »
rameshbabu
August 9, 2020 MOVIES, SLIDER
782
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. మహేష్, పరశురాం కాంబోలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రూపాయి నాణేలు ఎగరవేయడం కనిపించింది(మహేష్ పూర్తిగా కనిపించలేదు). కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Read More »