Classic Layout

ఎవరెవరో అనుకుంటే చివరికి అంజలితో సరిపెట్టుకున్న బాలయ్య..!

తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ కొత్త సినిమాకు హీరోయిన్ అంజలి ఓకే అయినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా డైరెక్టర్ బోయపాటి సోనాక్షి, నయనతారలను అడగగా వారు నో చెప్పారు. అంతేకాకుండా భారీగానే ముట్టపెమని అడగడంతో అంజలి లైన్ లోకి వచ్చింది.బోయపాటి బాలీవుడ్‌లోని ఇతర నటీమణులను కూడా సంప్రదించారు కాని వారిలో ఎవరూ రెమ్యునరేషన్ తగ్గించడానికి అంగీకరించలేదు. అన్ని అంశాలను పరిశీలిస్తే అంజలి కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు.

Read More »

ప్రపంచంలోనే అత్యంత కుర వృద్దుడు ఇక లేరు

ప్రపంచంలోనే అత్యంత వృద్దుడిగా జపాన్‌కు చెందిన చిటెట్సు వటనాబె(112) గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. 112 ఏళ్ల వయస్సులోనూ ఎంతో ఉత్సాహంతో నవ్వుతూ ఫొటో దిగిన ఆయన ఇక లేరు. చిటెట్సు వటనాబె ఆదివారం తుదిశ్వాస విడిచారని.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు గిన్నీస్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి జ్వరం, శ్వాసంబంధ సమస్యల కారణంగా వటనబె ఆహారాన్ని తీసుకునే పరిస్థితిలో లేరు. చిటెస్తు వటనాబేకు …

Read More »

బండి నారాయణ స్వామి, పి. సత్యవతిలకు కేంద్ర సాహిత్య అవార్డులు

తాను గుర్తించిన భాషల్లో ఉత్తమ సాహిత్యసృజన సాగిస్తున్న సాహిత్యవేత్తలకు అందజేస్తోంది. భారతీయ సాహిత్య పురస్కారాల్లో అత్యున్నతమైనదిగా ఈ పురస్కారాన్ని భావిస్తున్నారు. 2020 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకోనున్న బండి నారాయణ స్వామి, పి. సత్యవతి(అనువాద విభాగం)లకు సీఎం వైయస్ జగన్ అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యానికి ఇరువురూ విశేషమైన సేవలను అందించారని, రాష్ట్రం నుండి ఇద్దరు రచయితలను ఈ అవార్డు వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

Read More »

టీడీపీ కోసం సింగం పోలీస్ స్టేషన్ కూడా రెడీ !

గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ ప్రభుత్వం చేసిన ఆర్ధిక లావాదేవీలు, కీలక విధానాలు, నిర్ణయాలు, ప్రాజెక్టులు, భూముల లావాదేవీలపై విచారణ, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు కోసం తాజాగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు రాష్ట్ర ప్రభుత్వం ఓ పోలీసు స్టేషన్‌ హోదాను కల్పించింది. సీఆర్‌పీసీలోని సెక్షన్‌2ను అనుసరించి కేసుల నమోదు, దర్యాప్తు వంటి విస్తృత అధికారాలను సైతం ప్రభుత్వం వారికి కట్టబెట్టింది. దీనికి రాష్ట్రం మొత్తం పరిధి …

Read More »

రాష్ట్రపతి విందుకు జగన్ వెళ్లకపోవడానికి కారణం చెప్పిన చంద్రబాబు..!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులు రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింఫ్ ట్రంప్ దంపతులకు విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా అతి తక్కువమందిని మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు. అయితే ఈ ఆహ్వానితుల్లో …

Read More »

ఏపీలో తొలి తీర్పు …. లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి ఉరి శిక్ష

ఒకటో తరగతి చదువుతున్న అభం శుభం తెలియని చిన్నారిపై అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కిరాతకుడికి న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. చిత్తూరు నగరంలోని పోక్సో (లైంగిక దాడుల నుంచి చిన్న పిల్లల పరిరక్షణ) న్యాయస్థానం పూర్తి అదనపు ఇన్‌చార్జి న్యాయమూర్తి, మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి ఎం.వెంకట హరినాథ్‌ సోమవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. రాష్ట్రంలో పోక్సో చట్టం కింద ఉరిశిక్ష …

Read More »

 గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలు పటిష్టంగా పనిచేసేలా చర్యలు !

రాష్ట్రంలోని గ్రామ,పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలను పటిష్టవంతంగా పనిచేసేలా తగిన చర్యలు తీసోకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అమరావతి సచివాలయంలో గ్రామ,వార్డు సచివాలయాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ప్రజల ముగింటకే ప్రభుత్వ పాలన అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎంతో …

Read More »

జగన్ నిర్ణయాలను ప్రశంసించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు!

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రపంచబ్యాంకు బృందానికి సీఎం వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులపై సీఎంను, రాష్ట్ర ప్రభుత్వం చర్యలను ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం ప్రశంసిచింది. మానవవనరులపై పెట్టబడి ద్వారా అభివృద్ది ఫలితాలు వస్తాయన్న ప్రపంచబ్యాంకు బృందం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీసుకుంటున్న చర్యలు స్ఫూర్తిదాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

అక్కతో అక్రమ సంబంధం..చెల్లితో పెళ్లి

ఇద్దరు అక్కాచెల్లెళ్ల జీవితాలతో ఒక వ్యక్తి ఆడుకున్నాడు. అక్కతో ఐదేళ్లు సహజీవనం చేసిన యువకుడు ఆమె చెల్లిని రసహ్యంగా వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన ఒక యువతికి 2015లో ఒక యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. …

Read More »

రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. తెలుగురాష్ట్రాలనుంచి ఆరుగురు రిటైర్ !

ఏప్రిల్‌ నెలలో ముగియనున్న రాజ్యసభ సీట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం షెడ్యూల్ విడుదల చేసింది.. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్మెంట్ కానున్నారు.. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా, మార్చి 13వ తేదీ నామినేషన్లకు చివరి తేది. మార్చి 26న పోలింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat