Classic Layout

మూడేండ్లలోనే అమోఘమైన అభివృద్ధి..మంత్రి జగదీశ్‌రెడ్డి

అరువై ఏండ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా, ఈ మూడేండ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, అందరి కండ్లల్ల్లో ఆనందం నింపిన టీఆర్‌ఎస్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు, సీనియర్ నాయకుడు బాషా రెండువేల మంది కార్యకర్తలతో మంత్రి సమక్షంలో ఆదివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువా …

Read More »

ఆయ‌న‌తో గ‌డ‌ప‌డానికి మీకు ఓకే క‌దా?

సంచలన తార వార్తల్లో ఉండే రాధిక ఆప్టే..సినిమాల కంటే షార్ట్ ఫిలిమ్స్, యాడ్స్ తో ఫేమస్ అయింది. సినిమాల్లో అయినా యాడ్స్ లో అయినా రాధిక చాలెంజింగ్ పాత్రను పోషిస్తూ నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంటుంది. ప్ర‌తిభావంతురాలైన న‌టిగా పేరు పొందిన రాధికా ఆప్టే తెలుగులో ర‌క్త చ‌రిత్ర‌, ధోని, లెజెండ్‌, ల‌య‌న్ చిత్రాలూ, త‌మిళంలో ఈ మ‌ధ్యే ర‌జ‌నీకాంత్‌తో క‌బాలిలోన న‌టించింది. మీకూ, నాకూ .. అంద‌రికీ …

Read More »

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ మంత్రివర్గం నేటి మధ్యాహ్నం భేటీ కానుంది. హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ భేటీలో ముఖ్యంగా ఈ నెల 27వ తేదీ నుంచి మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, తీర్మానాలతో పాటు ప్రభుత్వం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపైనే కేబినేట్ స‌మావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే, శాసనసభ, మండలిలో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన …

Read More »

లావ‌ణ్య త్రిపాఠి నోట‌.. త్రిష‌ మాట – సీన్ క‌ట్ చేస్తే!

లావణ్య త్రిపాఠి ఒక రూపదర్శి మరియు సినీ నటి. తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించింది. 2012 లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా లావణ్య చిత్రరంగంలోకి ప్రవేశించింది. అయితే, చిన్న సినిమాలతో మొదలుపెట్టి మీడియం రేంజ్ హీరోయిన్‌గా ఎదిగిన లావణ్య త్రిపాఠి ఇకపై స్టార్ లీగ్‌లోకి ఎంటర్ అవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తోంది. అందులో భాగంగానే తన స్ట్రాటజీలో భాగంగా క్రమంగా స్టార్ హీరోల …

Read More »

నా ఇష్టం లేకుండానే మొదటి పెళ్లి జరిగింది..లక్ష్మీపార్వతి

గతంలో తన మొదటి పెళ్లి గురించి లక్ష్మీపార్వతి ప్రస్తావించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘నేను ఎన్టీఆర్ జీవితంలోకి రావడంపై చాలా విమర్శలు వచ్చాయి. అలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఏ మనిషినీ పూర్తిగా మంచి అని కానీ, లేదా చెడు అని గానీ అనం.. ఇది సహజమే’ అన్నారు.‘మీ మొదటి భర్త మిమ్మల్ని బాగా చూసేవారని అంటుంటారు. ఎంతవరకు వాస్తవం?’ అనే ప్రశ్నకు …

Read More »

జనసేన అధినేత పవన్ సంచలన నిర్ణయం

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధినేత పవన్ సంచలన  నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జనసేన పార్టీ ప్లీనరీ నిర్వహించాలని పవన్ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. త్వరలోనే తుది నిర్ణయాన్ని పవన్ స్వయంగా వెల్లడిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకూ ఇంత సీరియస్‌గా జనసేన పార్టీ కోర్ కమిటీ భేటీ జరగలేదు. ఇలాంటి తరుణంలో ఆదివారం ఇక్కడి …

Read More »

రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై రమణ ఏమన్నారంటే..?

పార్టీ మారబోనంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు . తాను పార్టీ మారడం లేదంటూ టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలో ఏమాత్రం స్పష్టత లేదని  రమణ అన్నారు. .. కాంగ్రెస్ నేతలను కలిశారన్న వార్తలను రేవంత్ ఖండించాలన్నారు. తమ పార్టీ నేతలను రేవంత్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఓపెనింగ్..ముఖ్యఅతిథిగా పవన్

త్రివిక్రమ్ దర్శకత్వంలోజూనియర్ ఎన్టీఆర్ గా హీరో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అగ్రహీరో పవన్ కల్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ సినిమాకు తొలి క్లాప్ కూడా పవనే కొట్టనున్నారు. కాగా, ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న తెరకెక్కించనుంది. 2018 జనవరి నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల …

Read More »

అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్ ప్రభాస్..కృష్ణంరాజు

ప్రభాస్ తన వారసుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అన్నారు ఆయన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రభాస్ గురించి మూడే మూడు మాటలు చెబుతాను. ఒకటి… అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్. ప్రభాస్ తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. రెండు.. సినిమాకు సంబంధించిన కథను ప్రతి హీరో వింటాడు. ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం …

Read More »

ఆసియా కప్ హాకీ : ఫైనల్లో భారత్ ఘన విజయం

ఢాకాలో జరిగిన ఆసియా కప్ హాకీ టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఢాకాలో ఈ రోజు మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది. భార‌త్ త‌రుపున ఆకాష్ దీప్ సింగ్‌, మన్‌దీప్ సింగ్‌లు చెరొక గోల్‌ను వేశారు. అంతకు ముందు టోర్నీ ఆరంభంలో మ‌లేషియా జట్టు భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఆసియా కప్ సాధించిన యువ ఆటగాళ్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat