Home / Tag Archives: Andhrapradesh Political news

Tag Archives: Andhrapradesh Political news

ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని

టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్‌07హెచ్‌ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …

Read More »

పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్‌

పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాలపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. డిజైన్ల ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందని.. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయడం లేదు కదా? అని ఆయన వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్‌ వ్యాఖ్యలను బొత్స దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. మాట్లాడే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. సాంకేతికంగా ఇబ్బందులుంటే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై …

Read More »

టీడీపీ గ్రాఫ్‌ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని

ఏపీ సీఎం జగన్‌ గ్రాఫ్‌ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్‌ ఫర్‌నేషనల్‌ స్టడీస్‌ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్‌ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్‌ వల్ల గ్రాఫ్‌ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …

Read More »

అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్‌ ట్వీట్‌

రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్‌ సక్సెస్‌ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్‌ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …

Read More »

వైఎస్సార్‌ ఫ్యామిలీ.. ఎక్స్‌క్లూజివ్‌ ఫొటోలు

తన మార్క్‌ పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నేత దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి. ఎప్పుడూ ప్రజల బాగోగుల కోసమే తపించే ఆయన.. వీలు చిక్కినప్పుడల్లా కుటుంబంతో గడిపేవారు. అప్పుడప్పుడూ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్‌, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌, మనవళ్లు, మనవరాళ్లతో సరదాగా విహారయాత్రలకూ వెళ్లేవారు.  ఇటీవల వైఎస్‌ జయంతి సందర్భంగా ఆయన తన కుటుంబంతో గడిపిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో …

Read More »

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్‌..

వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్‌ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్‌ చేస్తున్నట్లు …

Read More »

హైదరాబాద్‌లో ఎంపీ రఘురామపై కేసు నమోదు

ఏపీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసునమోదైంది. రఘురామ ఇంటి వద్ద ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభానిపై ఎంపీ సిబ్బంది దాడి చేశారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్‌, కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్‌పీఎఫ్‌ ఏఎస్‌ఐ, పీఏ శాస్త్రిలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

కుప్పంలో విశాల్‌ పోటీ.. క్లారిటీ ఇచ్చిన పెద్దిరెడ్డి

విద్య, వైద్యానికి సీఎం జగన్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసి ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్‌లు, సచివాలయ భవనాలు నిర్మించామని.. నాడు-నేడుతో భవన నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ అభివృద్ధి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో పెద్దిరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో 95 శాతం హామీలు అమలు చేసిన ఏకైక సీఎం …

Read More »

రాష్ట్రపతి ఎన్నిక.. వైసీపీ వైఖరిపై విజయసాయి స్పందన ఇదే

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీపై ఈడీ విచారణ కేంద్రం కక్షేమీ కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ స్థాయీ సంఘానికి సంబంధించిన నివేదికను ఛైర్మన్‌ హోదాలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఢిల్లీలో ఆయన అందించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌పై ఈడీ కేసుపై స్పందించారు. ఇందులో కక్ష సాధింపేమీ లేదని.. కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ వైఖరిపై విజయసాయిని …

Read More »

రైతులకు మేలు చేసేందుకు దేశంతో పోటీ: జగన్‌

కోనసీమలో క్రాప్‌ హాలిడే పేరుతో రైతుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని ఏపీ సీఎం జగన్‌ విమర్శించారు. గతంలో ధాన్యం బకాయిలు ఎగ్గొట్టినందుకా? ఆ బకాయిలను వైసీపీ ప్రభుత్వం తీర్చినందుకా? ఎందుకు క్రాప్‌ హాలిడే అని ప్రశ్నించారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పంటల బీమా పథకం కింద రూ.2,977కోట్ల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో సీఎం జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతులకు మేలు చేసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat