Home / Tag Archives: andrapradesh

Tag Archives: andrapradesh

కరోనా విషయంలో వలంటీర్లను అభినందించిన ప్రధాని.. జయహో జగన్

వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్‌ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు …

Read More »

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను …

Read More »

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ఈసీ తీరుపై మంత్రి బుగ్గన ఫైర్

‘రాజ్యాంగ బద్ధమైన పోస్టులో ఉండి తప్పుడు ప్రచారం చేస్తారా’ అంటూ ఈసీ తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో కరోనాపై అధికారికంగా ఈసీ సమీక్ష చేసిందా.. రాష్ట్రంలో కరోనాపై అంచనా వేయకుండా ఎన్నికలను ఎందుకు వాయిదా వేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు వైద్యాధికారులను సంప్రదించారా? రాష్ట్రంలో పరిస్థితిపై వైద్యాధికారుల నుంచి వివరాలు …

Read More »

ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీకీ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు పెట్టేందుకు అనుమతులు మంజూరు చేసింది. గుంటూరు జిల్లాలోని గురజాల, విశాఖపట్నంలోని పాడేరు, కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలలో ఈ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలను జారీ చేసింది. మరోవైపు ఒక్కో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రూ. 325 …

Read More »

సీఎం జగన్ చొరవ: పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తి

ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా పోలవరం పనులను పూర్తిస్థాయి ఇంజనీరింగ్, శాస్త్రసాంకేతిక పద్ధతుల్లో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించి ప్రాధాన్యత ఇస్తోంది. రాజకీయ, కాంట్రాక్టర్ల ప్రయోజనాలు పక్కనపెట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలు, లోటుపాట్లు, ముఖ్యంగా అశాస్త్రీయంగా (నాన్-ఇంజనీరింగ్) పద్ధతిలో చేపట్టిన పనులన్నింటినీ క్రమంగా సవరిస్తూ ఇంజనీరింగ్ మోడల్లోనే పోలవరంముందుకు సాగుతోంది. అటు నిర్మాణ పరంగానూ ఇటు ఇంజనీరింగ్ అనుమతుల్లోనూ ప్రాజెక్ట్ వేగం అందుకుంది. బహుళ …

Read More »

ఏక‌గ్రీవాల్లో మాచ‌ర్ల‌, చంద్ర‌గిరి పోటాపోటీ

నామినేష‌న్లు దాఖ‌లు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏక‌గ్రీవాలు న‌మోదు అయ్యాయి. చిత్తూరు, క‌డ‌ప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏక‌గ్రీవం అయ్యాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీటీసీల ఏక‌గ్రీవాలు గ‌ణ‌నీయంగా ఉన్నాయి. చాలా ఎంపీటీసీ స్థానాల‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున మాత్ర‌మే నామినేష‌న్లు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల డ‌మ్మీ అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసిన దాఖ‌లాలూ ఉన్నాయి. నామినేష‌న్ల …

Read More »

ఏపీలో 6 వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.

Read More »

ఏపీలో వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ కేయి ప్రభాకర్ రాజీనామా

ఏపీలో వలసల రాజకీయం మొదలైంది. ప్రతిపక్షం టీడీపీని వీడి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతుండటంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీని వీడారు. టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతంలో సీఎం సొంత జిల్లా కడప నుండి ఇద్దరు కీలక నేతలు వైసీపీకి దగ్గరయ్యారు. ఇక, ఇప్పుడు …

Read More »

మానవత్వాన్ని చాటిన వైసీపీ మంత్రి

ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రి పేర్నినాని మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఆసుపత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే..కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి కారులో ప్రయాణిస్తుండగా గాయపడిన వ్యక్తిని గమనించి.. తన కారులో మచిలీపట్టణం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పేర్నినాని ఆదేశించారు.

Read More »