కరోనా సంక్షోభంలో డబ్బే పరమావది కాకుండా మానవతాదృక్పథంతో వ్యవహరించి రోగులకు చికిత్స అందించాల్సిందిగా ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయినా పెడచెవిన పెట్టి కొవిడ్ చికిత్సకు ఇష్టానుసారం అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రులపై ప్రభుత్వం తాజాగా కొరడా ఝుళిపించింది. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు 64 ప్రైవేటు ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన ఆస్పత్రుల …
Read More »ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉచిత సలహాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …
Read More »కొవిడ్ వ్యాక్సినేషన్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 నుంచి సూపర్ స్ప్రెడర్స్‌కు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలోని ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, హోటల్స్, సెలూన్ల సిబ్బంది, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణదారులు, హమాలీలకు టీకాలు వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూపర్ స్ర్పెడర్లకు టీకాలు …
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »మోదీకి జగన్ లేఖ
ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ‘అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నది మా నిర్ణయం. వ్యాక్సిన్ల కొరతతో 45 ఏళ్లు పైబడిన వారికే ఇస్తున్నాం. ప్రైవేట్ ఆస్పత్రులకు నేరుగా వ్యాక్సిన్ ఇవ్వడం సరికాదు. వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్ ధరను నిర్ణయిస్తున్నారు. దీని వల్ల సామాన్య ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. 18-44 ఏళ్ల వారికి వ్యాక్సిన్ చేరాలంటే నెలలు పట్టేలా ఉంది’ అని జగన్ లేఖలో పేర్కొన్నారు
Read More »నెటిజన్లకు నయనతార సలహాలు
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్లైన్లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్ చేసి …
Read More »రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …
Read More »కరోనా టీకాపై శుభవార్త
ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.
Read More »దేశంలో కరోనా విషయంలో కాస్త ఊరట
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న 3.4 లక్షలకుపైగా కేసులు నమోదవగా, తాజాగా అవి 3.26 లక్షలకు తగ్గాయి. అయితే మృతులు మాత్రం పెరుగుతూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 3,26,098 కేసులు నమోదయ్యాయి. మరో 3,890 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,43,72,907కు చేరింది. ఇందులో 2,04,32,898 మంది బాధితులు కోలుకోగా, 36,73,802 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2,66,207 …
Read More »