Home / Tag Archives: carona (page 18)

Tag Archives: carona

గ్లెన్ మెక్ గ్రాత్ కి కరోనా

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్   కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వరుడ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది. క్యాన్సర్ బాధితుల కోసం రాబోయే టెస్టులో గ్లెన్ మెక్ గ్రాత్  ఫండ్ రైజింగ్ డ్రైవ్ తలపెట్టాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం గ్లెన్ మెక్ …

Read More »

ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా

ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.

Read More »

ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కరోనా కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. బెంగాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. 6,153 …

Read More »

15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.

Read More »

15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇస్తే.. ఆ తర్వాత వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ” ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి ” ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు ” ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ …

Read More »

ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.

Read More »

తెలంగాణలో కొత్తగా 235 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38,023 టెస్టులు చేయగా.. 235 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,307కు చేరాయి.. గడిచిన 24 గంటల్లో 204 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 346 మందికి టెస్టులు చేయగా.. 10 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.

Read More »

UKలో కరోనా కలవరం

UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.

Read More »

TRS Mp కె. కేశవరావు కి కరోనా

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.

Read More »

దేశంలో 781 ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో 62 కేసులు రాగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat