Home / Tag Archives: carona (page 33)

Tag Archives: carona

బీజేపీ నేతకు కరోనా

కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..

Read More »

ఏపీలో డబుల్ సెంచురీ కొట్టిన కరోనా కేసుల సంఖ్య

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది.ఏకంగా డబుల్ సెంచూరీ కొట్టింది కరోనా.గడిచిన ఇరవై నాలుగంటల్లో 216కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 147 ఏపీకి చెందినవి.మిగతావి ఇతర రాష్ట్రాల,దేశాల నుండి వచ్చిన వారికి సోకిన సంఖ్య అని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు కరోన కేసుల సంఖ్య 3,990కి చేరుకుంది.ఇందులో 2,403మంది డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లారు.1,510మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు..

Read More »

ఢిల్లీ సీఎంకు కరోనా నెగిటివ్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురైన సంగతి విదితమే. దీంతో ఆయన ఇంటి దగ్గర వైద్యులు శాంపిల్స్ సేకరించారు.శాంపీల్స్ ను పరీక్షలకు పంపించగా నెగిటివ్ గా తేలింది. గత కొద్ది రోజులుగా సీఎం అరవింద్ జ్వరం,గొంతు నొప్పితో బాధపడుతున్న సంగతి విధతమే..

Read More »

ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు

కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..

Read More »

కొత్త విద్యాసంవత్సరంపై కేంద్ర కీలక ప్రకటన

దేశ వ్యాప్తంగా రాబోయే విద్యాసంవత్సరానికి పాఠ్యాంశాల కుదింపు, తరగతుల నిర్వహణ సమయాన్ని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్ నిశాంక్ తెలిపారు. ఈ మేరకు ‘సిలబస్‌ ఫర్‌ స్టూడెంట్స్ 2020’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, పాఠశాల నిర్వాహకులు వారి ఆలోచనలు, సూచనలు తనతో పంచుకోవాలని మంత్రి కోరారు. వాటిని తుది నిర్ణయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ‘‘ …

Read More »

అమెరికా తర్వాత భారత్‌లోనే ‘సీరియస్‌’!

కొవిడ్‌ విజృంభణ భారత్‌లో కొనసాగుతూనే ఉంది. ఏ రోజుకారోజూ అత్యధిక కేసులు నమోదవుతూ ఆందోళనకర స్థాయికి చేరుతోంది. గడచిన 24 గంటల్లో 9987 కేసుల నమోదు ఓ రికార్డు కాగా… 331 మంది మృత్యువాత పడ్డారు. దీనితో దేశంలో కరోనా వైరస్‌ మరణాల సంఖ్య 7,476కు చేరింది. మొత్తం 2,66,598 కేసులతో అంతర్జాతీయంగా ఐదో స్ధానంలో ఉన్న భారత్‌… ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కరోనా బాధితుల సంఖ్యలో రెండో …

Read More »

టీడీపీ మాజీ ఎంపీ ఇంట్లో కరోనా కల్లోలం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. మురళీమోహన్ కుమారుడి ఇంట్లో పని చేస్తున్న ముగ్గురు పని మనుషులకు వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఇద్దరు భార్యా భర్తలు, కాగా, మరో మహిళ వంట మనిషిగా పని చేస్తోంది. టోలిచౌకికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడికి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉంటున్న మరో యువతికి …

Read More »

ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులెక్కువ

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.దాదాపుగా రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో ఈ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదయ్యాయి. మహరాష్ట్రలో 88,528,తమిళనాడులో 33,229,ఢిల్లీలో 29,943,గుజరాత్ రాష్ట్రంలో 20,545,ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 10,947,రాజస్థాన్ లో 10,763,మధ్యప్రదేశ్ 9,638,వెస్ట్ బెంగాల్ 8,613,కర్ణాటక లో 5,760కేసులు నమోదయ్యాయి..

Read More »

తెలంగాణ బాటలో తమిళనాడు

పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.

Read More »

కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే

దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్‌-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్‌ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ …

Read More »