Breaking News
Home / Tag Archives: delhi

Tag Archives: delhi

పవనే తమ వెంట పడుతున్నాడని అమిత్‌షా చెప్పారు: కేఏ పాల్‌

వచ్చే ఎన్నికల్లో 175 లోక్‌సభ స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పాల్‌.. గురువారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పని అయిపోయిందని.. అపోజిషన్‌ స్థానాన్ని తామే భర్తీ చేస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను అమిత్‌షాతో చర్చించినట్లు పాల్‌ తెలిపారు. …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.

Read More »

మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.

Read More »

ఢిల్లీలో రేపు సీఎం కేసీఆర్ దీక్ష

దేశ రాజధాని నగరం యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కేంద్రం 100% కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం దీక్ష చేపట్టనుంది. దీక్షలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్యనేతలంతా పాల్గొంటారు. పంటి చికిత్స కోసం ఢిల్లీ వెళ్లి, అక్కడే ఉన్న సీఎం కేసీఆర్‌ కూడా దీక్షలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ ఈ నెల …

Read More »

తెలంగాణ ప్రజల్ని పీయూష్‌ గోయల్‌ అవమానించారు: హరీష్‌రావు

తెలంగాణ ప్రజలను అవమాన పరిచేరీతిలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడారని మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనాలని తాము కోరుతుంటే.. నూకలు తినమని చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు. సిద్దిపేట జిల్లా శ్రీగిరిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ  సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు.  నూకలు తినాలంటూ అవమాన పరిచిన ఢిల్లీ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో నూకలు చెల్లేలా  తీర్పు ఇవ్వాలని …

Read More »

పంజాబ్‌లాగే మా వడ్లు కూడా తీసుకోవాల్సిందే: నిరంజన్‌రెడ్డి

ధాన్యం సేకరణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పామన్నారు. ఢిల్లీలో రాష్ట్ర మంత్రుల, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ చాలా హేళనగా మాట్లాడారని.. తెలంగాణ రాష్ట్రం, ప్రజలను ఆయన అవమానించారని ఆరోపించారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనేది తమకు సంబంధం లేదని.. మిల్లర్లతో మాట్లాడుకుని కేంద్రమే పట్టించుకోవాలన్నారు.  …

Read More »

ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మేం పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటాం: కేజ్రీవాల్‌

ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలు (ఎంసీడీ)ను వాయిదా వేస్తున్న నేపథ్యంలో బీజేపీపై ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.  బ్రిటీష్‌ పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించి ప్రజాస్వామ్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని.. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికలను వాయిదా వేయడమంటే వారిని అవమానించినట్టేనని చెప్పారు. దిల్లీ అసెంబ్లీ వద్ద కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు.  ఎంసీడీ ఎన్నికలను సరైన సమయంలో నిర్వహించి …

Read More »

యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్‌ రిజల్ట్స్‌ విడుదల

దిల్లీ: యూపీఎస్సీ (యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) సివిల్స్‌ మెయిన్‌ ఎగ్జామ్-2021 రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ తదితర ఆల్‌ ఇండియా సర్వీసుల్లో అధికారుల నియామకం కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు మెయిన్‌ పరీక్షలను నిర్వహించారు. మెయిన్స్‌లో దేశవ్యాప్తంగా 1,823 మంది ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయ్యారు. వీరికి ఏప్రిల్‌ 5 …

Read More »

మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో కిడ్నాప్ కలకలం

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ,బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ సంఘటన సంచలనం సృష్టించింది. సోమవారం రాత్రి  ఎనిమిదిన్నరకు జరిగిన ఈ ఘటనలో  సౌత్ అవెన్యూలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా ,మహబూబ్ నగర్ కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరు గుర్తు …

Read More »

ఢిల్లీలో కరోనా విజృంభణ

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న కేసుల్లో తాజాగా పెరుగుదల కనిపించింది. కాగా.. ఒక్కరోజే 45 మంది కరోనా వల్ల మరణించారు. థర్డ్ వేవ్ ఇవే అత్యధికం. ఇదిలా ఉండగా.. 24గంటల వ్యవధిలో 70,226 టెస్టులు చేయగా.. 11,486 మందికి పాజిటివ్ గా తేలింది.

Read More »
aviator hile interbahis giriş sweet bonanza siteleri - - medyumaşk büyüsümuskabüyüücretsiz bakımbüyü bozma