Home / Tag Archives: ex mp (page 2)

Tag Archives: ex mp

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఉచిత సలహాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …

Read More »

మాజీ మంత్రి ఈటలతో మాజీ ఎంపీ భేటీ

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే,సీనియర్ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరి ఆ తర్వాత ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన  మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిన్న రాత్రి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ‘నేను రాజకీయాల గురించి మాట్లాడేందుకు రాలేదు. ఈటల సతీమణి జమునా రెడ్డి నా సమీప బంధువు. ఈటల ఏ నిర్ణయం …

Read More »

ఎమ్మెల్సీ కవిత మానవత్వానికి ‘జ్ఞాపిక’

ఆ భార్యాభర్తలది ఏపీలోని ప్రకాశం జిల్లా.. నిరుపేద కుటుంబం.. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న తమ కూతురికి వెన్నెముక సంబంధిత వ్యాధి రావటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చేర్పించారు.. పరీక్షించిన డాక్టర్లు ఆపరేషన్‌ చేయించాలని చెప్పారు.. సర్జరీకి అవసరమయ్యే డబ్బులేక ఆ దంపతులు తమలో తామే కుమిలిపోయారు.. ఆ బాలిక చిమ్మల జ్ఞాపిక (11) దీనస్థితిని చూసిన కొందరు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఆ విషయం తెలుసుకొన్న ఎమ్మెల్సీ కవిత తక్షణమే స్పందించి …

Read More »

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …

Read More »

కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మృతి పట్ల రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మానవతావాది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఎమ్మెస్సార్, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ముక్కుసూటి మనిషిగా సమస్యల …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన …

Read More »

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గ0 నుండి పోటీ చేస్తున్న మాజీ ప్రదాని పి.వి. నర్సింహరావు కుమార్తె సురభి వాణీ దేవి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మందా జగన్నాథ0 అన్నారు.శాంతి నగర్ లోని వడ్డేపల్లి మాజీ జడ్పిటిసీ శ్రీనివాసులు స్వగృహంలో టి ఆర్ ఎస్ నాయకులు మందా శ్రీనాథ్, వడ్డేపల్లి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ‘కోటి వృక్షార్చన’ పోస్టర్ విడుదల

సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న , రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు, ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎంపీ సంతోష్ కుమార్.సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి సంకల్పానికి మద్దతుగా ఒకే రోజు కోటి మొక్కలను నాటే ‘కోటి వృక్షార్చన’ …

Read More »

తిరుమలలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. తన మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను పొంగులేటి గారి దంపతులకు అందజేశారు. స్వామివారి దర్శనం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat