Home / Tag Archives: khammam

Tag Archives: khammam

ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

 ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు అయ్యాయి. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని 60 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్ల జాబితాను ఇవాళ విడుద‌ల చేశారు. 1, 8 డివిజ‌న్లు ఎస్టీ జ‌న‌ర‌ల్, 32వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు కేటాయించారు. 22, 42, 59 డివిజ‌న్ల‌ను ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 40, 43, 52, 60 డివిజ‌న్ల‌ను ఎస్సీ జ‌న‌ర‌ల్‌కు, 28, 29, 30, 33, …

Read More »

 భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలోని  భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.

Read More »

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

Read More »

సైకిల్ పై మంత్రి పువ్వాడ పర్యటన

ఖమ్మం నగరంలో పలు అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించేందుకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ జిల్లా కలెక్టర్ RV కర్ణన్ , మున్సిపల్ కమీషనర్ అనురాగ్ జయంతితో కలిసి సైకిల్ పై పర్యటించారు. జడ్పీ సెంటర్, తుమ్మలగడ్డ, బోనకల్ క్రాస్ రోడ్, చర్చ్ కాంపౌండ్, శ్రీనివాస్ నగర్, జహీర్ పురా, శ్రీనివాస్ నగర్, కిన్నెరసాని థియేటర్ రోడ్, హర్కర్ బావి సెంటర్, PSR రోడ్, గుంటి మల్లన్న దేవాలయం రోడ్, …

Read More »

షర్మిల బరిలోకి దిగే అసెంబ్లీ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఇందులో భాగంగా వచ్చే నెల ఏఫ్రిల్ 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అయితే తాను ఎక్కడ నుండి బరిలోకి దిగితానో అనే అంశం గురించి వైఎస్ షర్మిల క్లారిటీచ్చారు. బుధవారం జరిగిన ఖమ్మంజిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఈ క్రమంలో తాను రాష్ట్రంలోని …

Read More »

చరిత్రలో లేనివిధంగా ఖమ్మంలో తొలిసారిగా వైఎస్ షర్మిల

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అజారుద్దీన్‌ కుమారుడైన మహమ్మద్‌ అసదుద్దీన్‌ శుక్రవారం లోట‌స్‌పాండ్‌లో షర్మిలను కలిశారు. అసదుద్దీన్‌తో పాటుగా ఆయన భార్య ఆనం మీర్జా కూడా ఉన్నారు. తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జాకు ఆనం మీర్జా సోదరి. రాజకీయ, క్రీడా రంగాల్లో ప్రముఖులైన అజారుద్దీన్‌, సానియా మీర్జాల కుటుంబ సభ్యులు కొత్తగా పార్టీ పెట్టనున్న షర్మిలను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారు మర్యాద పూర్వకంగానే కలిశారని లోట్‌సపాండ్‌ వర్గాలు …

Read More »

ఖమ్మంలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణలో ఖమ్మం జిల్లాలో రెండో ఐటీ టవర్‌ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.36కోట్ల వ్యయంతో 55వేల చదరపు అడుగుల్లో టవర్‌ను నిర్మించనున్నారు. ప్రత్యక్షంగా 570 మంది ఒకేసారి పని చేసుకునేలా సువిశాలమైన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఖమ్మంలోని ఇల్లందు సర్కిల్ వద్ద ప్రస్తుతం ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించగా.. సేవలు నిర్విరామంగా సాగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ కృషితో తాజాగా …

Read More »

షర్మిల పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి విధితమే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్సార్ అభిమానులతో ఆమె సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ”తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని  అన్నారు.. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో …

Read More »

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

తెలంగాణ రాష్ర్టానికి సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కామేపల్లి మండలాల్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య, కలెక్టర్‌ ఎమ్వీ రెడ్డితో కలిసి మంత్రి పర్యటించారు. ఇల్లెందులో బస్‌డిపోకు శంకుస్థాపన చేశారు. అనంతరం బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. సీఎల్పీ నేత …

Read More »

తెలంగాణలో క్వింటాల్ మిర్చి రూ.13,700

తెలంగాణ రాష్ట్రంలో  మిర్చి రేటు ఘాటెక్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం, డీలక్స్ రకం మిర్చి గరిష్టంగా క్వింటాల్ రూ.13,700 పలికింది. నిన్న ఒక్కరోజే రైతులు 50 వేల మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. మరోవైపు పత్తిని గరిష్ఠంగా క్వింటాల్ రూ.6 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ పత్తికి కేంద్రం మద్దతు ధర రూ. 5,825గా …

Read More »