నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …
Read More »కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు….కేటీఆర్
విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు …
Read More »తెలంగాణ రాష్ట్రంతో యూరోపియన్ దేశం ఒప్పందం..
తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుదర్చుకునేందుకు ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్ దక్కన్ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్ పాయల్ రాజ్‌పాల్, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …
Read More »కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు
రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …
Read More »లీడర్ లేని కాంగ్రెస్.. క్యాడర్ కూడా లేని టీడీపీ..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, రాష్ట్ర అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్న శక్తులు మహాకూటమి పేరుతో మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పొరపాటునో, గ్రహపాటునో వారు అధికారంలోకి వస్తే తెలంగాణకు కడగండ్లు తప్పవని, తెలంగాణ మళ్లీ తల్లడిల్లిపోవడం ఖాయమని హెచ్చరించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో నిర్వహించిన దసరా సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్య …
Read More »కేటీఆర్‌ను విమర్శించి నవ్వుల పాలు అవుతున్న బాబు
గోబెల్స్ ప్రచారానికి సుప్రసిద్ధ చిరునామా,అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరు అని రాజకీయ ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదుర్కునే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు అదే తరహాలో వ్యవహరిస్తున్నారని అంటున్నారు.తాను చేస్తే సంసారం ఎదుటివారు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా వ్యవహరించే బాబు తీరు.ఆయన అత్యుత్సాహం కారణంగానే నవ్వులపాలు అయిందని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ పార్టీ యువనేత కేటీఆర్ విషయంలో చంద్రబాబు చేసిన కామెంట్లతో మారోమారు ఈ …
Read More »టీఆర్ఎస్ గెలుపునకు 17రోజులు పాదయాత్ర చేసిన ఆంధ్రా యువకుడు రోహిత్.. అభినందించిన మంత్రి కేటీఆర్.. విజయవాడ నుంచి కాలినడకన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ గత 17 రోజులుగా విజయవాడ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగిందితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ …
Read More »టీడీపీ అధినేతవి శిఖండి రాజకీయాలే…..కేటీఆర్
రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బయటికి కనిపించేది కాంగ్రెస్ అయినా దానివెనుక ఉండి కాంగ్రెస్ తోలుబొమ్మను ఆడించేది మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ప్రయత్నించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే కొనుగోలుచేసే ప్రయత్నాల్లో ఉన్నారని అన్నారు. చంద్రబాబువి శిఖండి రాజకీయాలుగా మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. ఓటుకు నోటు కేసులో చట్టం తన పని …
Read More »న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా
ఓ దేశ ప్రధాని మొదటిసారి మన బతుకమ్మ ఆడారు. శుక్రవారం న్యూజిలాండ్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నారైలు నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆ దేశ ప్రధాని జెసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు. అంతకుముందు బతుకమ్మకు పూజచేశారు. ప్రపంచంలోనే బతుకమ్మ వేడుకల్లో ఓ దేశ ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదేమొదటిసారి అని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని గౌరవించి …
Read More »ప్రపంచ చరిత్రలోనే బతుకమ్మ సంబురాల్లో ఓ దేశ ప్రధాని ఆడిపాడటం ఇదే తొలిసారి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. న్యూజిలాండ్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఆడపడుచులతో కలిసి న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. జెసిండా నుదుటన బొట్టు పెట్టుకొని.. బతుకమ్మ చుట్టూ తిరిగి గౌరమ్మకు పూజ చేశారు. అక్కడి తెలంగాణ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యూజిలాండ్ చరిత్రలో ప్రధాన మంత్రిగా ఉంటూ బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా ఆమె …
Read More »