Home / Tag Archives: national

Tag Archives: national

పెట్రోల్ పై శుభవార్త.

ప్రస్తుతం పెట్రోల్,డీజిల్ పై ధరలు ఆకాశన్నంటుతున్న సంగతి విధితమే. అయితే పెట్రోలు ను జీఎస్టీ  పరిధిలోకి తెస్తే రూ.75కే లీటర్ వస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. అటు డీజిల్ రూ.68కి వస్తుందన్నారు. అయితే ఇందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. చమురును GST పరిధిలోకి తెస్తే రాష్ట్రాలకు నష్టం కలుగుతుందన్నారు. ఇక వీటిని జీఎస్టీలోకి  తెస్తే కేంద్రం, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందన్నారు.

Read More »

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు

Read More »

దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…

Read More »

దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న  తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు

Read More »

Big Breaking News-25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ నడుస్తున్నట్లు కన్పిస్తుంది. ఎక్కడ చూసిన కానీ కరోనా పాజీటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వార్తలను వింటున్నాం. తాజాగా ఒడిశా సంబల్పూర్‌ జిల్లాలోని బుర్లాలోని వీర్‌ సురేంద్రసాయి యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ (వీఎస్‌ఎస్‌యూటీ)కి చెందిన 25 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. బాధిత విద్యార్థులంతా ఒకే హాస్టల్‌కు చెందిన వారని, వారిని చికిత్స కోసం బుర్లా వీర్‌ సురేంద్ర సాయి ఇస్టిట్యూట్‌ ఆఫ్‌ …

Read More »

మోదీ సర్కారు సంచలన నిర్ణయం

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం. వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల …

Read More »

మీకు తక్కువ ధరకు పెట్రోల్ కావాలా..?అయితే మీకోసం..?

ప్రస్తుతం మన దేశంలో పెట్రోలు వంద కొట్టింది. అయితే, తక్కువ ధరకు పెట్రోల్ దొరికే దేశాలు చూస్తే.. వెనిజులాలో లీటరు పెట్రోలు రూ. 1.45, అంగోలాలో ధర రూ. 17.77 అల్జీరియాలో రూ.25.32, కువైట్లో రూ.25.13 సూడాన్ లో రూ. 27.20, ఖజఖస్తాన్ లో రూ.29.62 ఉంది. మరోవైపు కతర్ లో రూ. 29.28, తుర్క్ మేనిస్తాన్లో రూ. 31.08 నైజీరియాలో రూ. 31.568గా ఉంది. ఇక మన పొరుగు …

Read More »

భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?

భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.

Read More »

బీజేపీలోకి పీటీ ఉష

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ   ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More »