Home / Tag Archives: NIZAMABAD

Tag Archives: NIZAMABAD

ఇందూరులో బీజేపీ కార్పొరేటర్ వసూళ్ల దందా బట్టబయలు..ఆడియో లీక్..!

తెలంగాణలో కాషాయనేతలు కమీషన్ల రాజాలుగా అవతారమెత్తారు..ఆ ఊరు, ఈ పట్టణం అనే తేడా లేదు..కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వసూళ్ల దందాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా కార్పొరేటర్లు తమ డివిజన్ల పరిధిలో కొత్తగా అపార్ట్ మెంట్ లేదా ఇల్లు కడితే చాలు…కమీషన్ ఇవ్వాల్సిందే అంటూ హుకుం జారీ చేస్తున్నారు..సదరు బిల్డర్ లేదా, ఇంటి యజమానులను వేధించి, బెదిరించి మరీ లక్షలకు లక్షలు వసూళ్లు చేస్తున్నారు. నిజామాబాద్ లో …

Read More »

అభాగ్యులకు అండగా ఎమ్మెల్సీ కవిత

TRS ఎమ్మెల్సీ కవిత కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంత ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.వర్షపు నీరు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. అలాగే కేసీఆర్‌ బువ్వకుండా ద్వారా వారి ఆకలిని తీర్చారు. నగరంలోని ధర్మపురి కాలనీ నాగారం, …

Read More »

ఆర్మీని కూడా ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు

‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్‌ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్‌ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …

Read More »

అర్వింద్‌.. పసుపు బోర్డు ఏదీ?.. ఇంకెన్నాళ్లు మాయమాటలు?: కవిత

అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల క్రితం పసుపు …

Read More »

వెంటాడిన మృత్యువు.. టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్‌ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.  ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …

Read More »

MLC గా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవం

ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి క‌ల్వ‌కుంట్ల క‌విత ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ స్థానానికి పోటీ చేసిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి శ్రీనివాస్ నామినేష‌న్‌ను ఎన్నిక‌ల అధికారులు తిర‌స్క‌రించారు. శ్రీనివాస్ అఫిడ‌విట్‌లో త‌ప్పులు ఉన్నాయ‌ని, ఈ క్ర‌మంలోనే నామినేష‌న్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేశారు. క‌విత ఏక‌గ్రీవంపై అధికారికంగా ప్ర‌క‌ట‌న వెలువ‌డాల్సి ఉంది. ఉమ్మడి నిజా‌మా‌బాద్‌ జిల్లా నుంచి కల్వ‌కుంట్ల కవిత మరో‌సారి బరి‌లోకి దిగిన విష‌యం …

Read More »

TRSలో చేరిన BJP నేతలు

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలానికి చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్యే ఇంటిలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి టీఆర్‌ఎస్‌ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More »

నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదు- కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో నిజామాబాద్‌లో పసుపు బోర్డు పెట్టేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇప్పటికే ఏర్పాటుచేసిన సుగంధ ద్రవ్యాల (స్పైసెస్‌) బోర్డు రీజినల్‌ ఆఫీస్‌తో సరిపెట్టుకోవాలని సూచించింది. దేశంలోనే అత్యధికంగా పసుపు పండిస్తున్న తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయంచేసింది. వంద రోజుల్లో బోర్డు సాధిస్తామంటూ ఓట్లు దండుకొని.. గెలిచిన తర్వాత మాయమాటలు చెప్తూ మభ్యపెడుతున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌, రాష్ట్ర బీజేపీ నేతల బండారం పార్లమెంట్‌సాక్షిగా బట్టబయలైంది. వారివన్నీ బోగస్‌ హామీలని తేలిపోయింది. …

Read More »

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఆరు టేబుళ్లపై రెండు రౌండ్‌ల పాటు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 823 ఓట్లు పోలవగా, మొదటి రౌండ్‌లో 600 ఓట్లను లెక్కించనున్నారు. రెండో రౌండ్‌లో 223 ఓట్లను లెక్కిస్తారు. పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లు తీయగా సగానికంటే ఒక ఓటు ఎక్కువ పోలైన అభ్యర్థిని …

Read More »

పెళ్ళి బారాత్ లో వరుడు మృతి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో పెద్ద విషాదం నెలకొన్నది. పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో నివాసముంటున్న గణేష్ శుక్రవారం పెళ్ళి చేసుకున్నాడు. దీనిలో భాగంగా రాత్రి బారాత్ నిర్వహించారు. బారాత్ లో భాగంగా పెద్ద పెద్ద సౌండ్స్ తో డీజేను కూడా ఏర్పాటు చేశారు. బారాత్ లో డాన్స్ చేస్తున్న గణేష్ డీజే సౌండ్ కు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో గణేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat