భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో బంగా నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.
Read More »డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణలు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అత్యాచార ఆరోపణల కింద జీన్ క్యారోల్ అనే రచయిత కేసు పెట్టేందుకు సిద్ధమయ్యారు. 1995లో ట్రంప్ తనను అత్యాచారం చేశారని ఆమె ఇదివరకే ఆరోపించారు. ఘటన జరిగి ఎన్నాళ్లైనా బాధితులు కేసు నమోదు చేయొచ్చని ఇటీవల న్యూయార్క్ చట్టాల్లో సడలింపులు రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇప్పటికే ట్రంప్ పై పరువునష్టం దావా వేశారు క్యారోల్.
Read More »