Home / Tag Archives: telangana

Tag Archives: telangana

కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్

కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 32మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ రేటు 89.33 శాతంగా ఉంది. ఇక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 64,362టెస్టులు చేశారు.

Read More »

సీఎం కేసీఆర్ పై షర్మిల అగ్రహం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత,సీఎం KCRపై వైఎస్ షర్మిల మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో లాక్డౌన్ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు వైఎస్ షర్మిల.. ‘అయ్య పెట్టడు అడుక్కు తిననియ్యడు. KCR కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడు.. ఆయుష్మాన్ భారత్లో చేరరు’ అంటూ విరుచుకుపడ్డారు. సీఎం ‘KCR సారు .. సోయిలకురా. ఇప్పటికైనా సర్కార్ దవాఖానాలను సక్కగ చేసి, కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చు’ అంటూ వైఎస్ …

Read More »

తెలంగాణ క్యాబినేట్ నిర్ణయాలు

ప్రగతి భవన్ లో మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలు : – మే 12వ తేదీ బుధవారం ఉదయం 10 గంటల నుంచి.. 10 రోజులపాటు లాక్ డౌన్ విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. గత అనుభవాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కూడా పాజిటివ్ కేసులు తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలించిన సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ రెమిడెసివిర్ …

Read More »

నేడు ఈటల కీలక ప్రకటన

తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.

Read More »

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు-షాకింగ్

నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి నోముల భ‌గ‌త్ భారీగా మెజార్టీ దిశ‌గా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండ‌గా, బీజేపీ అడ్ర‌స్ గ‌ల్లంతు అయింది. ప్ర‌తీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని క‌న‌బ‌రుస్తోంది. 15వ‌ రౌండ్ ముగిసే స‌రికి 9,914 ఓట్ల‌ మెజార్టీతో నోముల భ‌గ‌త్‌ ముందంజ‌లో ఉన్నారు. పోస్ట‌ల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్య‌ధిక ఓట్లు …

Read More »

కాంగ్రెస్ సీనియర్ మంత్రి ఎమ్మెస్సార్ మరణం పట్ల మంత్రి గంగుల కమలాకర్ సంతాపం

రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మేనేని సత్యనారాయణ రావు (ఎం ఎస్ ఆర్) మృతి పట్ల రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంతాపం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా వాసిగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మానవతావాది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారు ఎమ్మెస్సార్, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్ గా ముక్కుసూటి మనిషిగా సమస్యల …

Read More »

సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం

హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో  భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్‌ చౌరస్తాలో ఉన్న జబ్బార్‌ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.

Read More »