Home / Tag Archives: telangana (page 32)

Tag Archives: telangana

సికింద్రాబాద్‌లో తప్పిన అగ్నిప్రమాదం

హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగరాల్లో  భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్‌లోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం బన్సీలాల్‌పేట్‌ చౌరస్తాలో ఉన్న జబ్బార్‌ కాంప్లెక్స్‌లోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపులో ఉన్న సరుకు అంతా కాలి బూడిదయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని తెలిపారు.

Read More »

తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.

Read More »

గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Read More »

తెలంగాణలో పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు గ్యాస్

టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పుడూ ముందుండే మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఆ టెక్నాలజీని అభివృద్ధి చేసి కొత్త పుంతలు తొక్కిస్తోంది. పటిష్టమైన ప్రణాళికతో ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేకుండా నేరుగా పైపుల ద్వారా గృహ, వాణిజ్య అవసరాలకు మేఘా గ్యాస్ ను సరఫరా చేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి నేరుగా గ్యాస్ ను సరఫరా చేయడంతో పాటు వాహన అవసరాలకు ఇంధనాన్ని అందిస్తోంది. ఈ మేఘా టెక్నాలజీతో సమయం ఆదాతో …

Read More »

తెలంగాణలో‌ నూత‌న జోన‌ల్ విధానానికి కేంద్రం ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన …

Read More »

మీ పేరుపై ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోండి ఇలా..?

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను విజయవాడ టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించి సోమవారం ప్రారంభించింది. http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ …

Read More »

వివేక్ కోటి మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం : ఎంపీ జోగినపల్లి

ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, తమిళ హాస్యనటుడు వివేక్ హఠాన్మరణం పట్ల రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. గ్రీన్ కలామ్ ప్రాజెక్టు ద్వారా కోటి మొక్కలు నాటాలనుకున్న వివేక్.. ఆ సంకల్పంలో భాగంగా 32 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారని గుర్తు చేసుకున్నారు. ప్రకృతి పట్ల, పర్యావరణ పరిరక్షణ పట్ల వివేక్ నిబద్ధత గొప్పదని, ఆయన కోటి మొక్కల కల నెరవేరకుండానే మరణించడం …

Read More »

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు

గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌ర‌పాల‌క సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో షెడ్యూల్ ప్ర‌కారం ఇవాళ రిజ‌ర్వేష‌న్ల జాబితాను విడుద‌ల చేశారు. వ‌రంగ‌ల్ న‌గ‌ర ప‌రిధిలోని 66 డివిజ‌న్ల‌కు రిజ‌ర్వేష‌న్లు ఖరారు కాగా, 65వ డివిజ‌న్ ఎస్టీ మ‌హిళ‌కు, 2వ డివిజ‌న్ ఎస్టీ జ‌న‌ర‌ల్‌కు కేటాయించారు. 1, 3, 14, 43, 46 డివిజ‌న్లు ఎస్సీ మ‌హిళ‌ల‌కు, 15, 17, 18, 37, 47, 53 డివిజ‌న్ల‌ను ఎస్సీ …

Read More »

 భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

తెలంగాణ రాష్ట్రంలోని  భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.

Read More »

తెలంగాణలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat