టీఎస్ఆర్టీసీ తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతోంది. మార్చి నుంచి 16 బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. నమూనా బస్సు సోమవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణానికి రాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఈడీ (ఆపరేషన్స్) పీవీ మునిశేఖర్‌లు పరిశీలించారు. దూరప్రాంతాలకు, ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేసేవారికి ఈ బస్సులు సౌకర్యంగా ఉంటాయి. ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ఏసీ స్లీపర్ …
Read More »ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్
ఈ నెల 19న ఫాదర్స్‌డే సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్ల లోపు పిల్లలతో కలిసి ప్రయాణించే తల్లిదండ్రులకు అన్ని బస్ సర్వీస్‌ల్లో ఆ ఒక్కరోజు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Read More »టెన్త్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
తెలంగాణలో త్వరలో జరగనున్న పరీక్షల నేపథ్యంలో టెన్త్ విద్యార్థుల బస్పాస్ రెన్యువల్ కు తెలంగాణ ఆర్టీసీ అధికారులు అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ పరిధిలో టెన్త్ విద్యార్థులకు ఈనెల 30తో బస్పాసుల గడువు ముగియనున్నాయి.. పరీక్షల దృష్ట్యా పాస్ రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పించారు. అటు టెన్త్ చదువుతున్న విద్యార్థినులకు జారీ చేసిన ఉచిత పాసులు పరీక్షలు పూర్తయ్యే వరకు చెల్లుబాటు అవుతాయని, ఇప్పుడున్న ఐడీ …
Read More »తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం
తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 1,000 బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో జీహెచ్ఎంసీ పరిధిలోకి 400-500 బస్సులు రానున్నాయి. బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ త్వరలో టెండర్లు ఫైనల్ చేయనుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో తిరుగుతున్న బస్సులతో RTCకి రోజుకు రూ.3.50 కోట్ల ఆదాయం వస్తుండగా.. దాన్ని రూ.4 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read More »యాదాద్రికి ఆర్టీసీ బస్సులు… చార్జీలు ఎంత అంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జంట నగరాల నుండి.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం నుండి ఉప్పల్ సర్కిల్ కు అక్కడ నుండి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి దేవాలయానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. యాదాద్రిలోని లక్ష్మీనరసింహ స్వామివారి మూలవిరాట్ దర్శనాలు పునఃప్రారంభమైన నేపథ్యంలో భక్తుల కోసం యాదాద్రి దర్శిని పేరుతో ఆర్టీసీ మినీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉప్పల్ …
Read More »టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త
టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త వినిపించింది. గరుడ ప్లస్ ఛార్జీలు తగ్గించింది. ప్రయాణికులకు విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించారు. దీంతో ప్రయాణీకులు రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు అని స్పష్టం చేశారు. సవరించిన, తగ్గించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు …
Read More »TSRTC మరో Good News
తెలంగాణ రాష్ట్రం నుండి పలు ప్రాంతాలకెళ్లే ప్రయాణికుల కోసం సంక్రాంతి పండుగకు 4,318 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ రోజు శుక్రవారం 7 నుంచి 14 వరకు రాష్ట్రంలోని అన్ని ముఖ్య ప్రాంతాలతో పాటు ఏపీకి ఈ బస్సులు నడుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో 3,334 బస్సులు, ఏపీకి 984 బస్సులు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. …
Read More »TSRTC మహిళా కండక్టర్లకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కండక్టర్లకు TSRTC శుభవార్త చెప్పింది. మహిళా కండక్టర్లు విధులు ముగించుకొని రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని అధికారులను MD V.C.సజ్జనార్ ఆదేశించారు. ఒకవేళ రాత్రి 8 తర్వాత డ్యూటీలు వేయాల్సి వస్తే.. అందుకు సంబంధించిన వివరణను హెడ్ ఆఫీసుకు తెలియజేయాలన్నారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజినల్ మేనేజర్లు ఈ ఆదేశాలను పాటించాలని సజ్జనార్ తెలిపారు.
Read More »RTC ఎండీ సజ్జనార్ సంచలన నిర్ణయం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. బస్టాండ్లలోని దుకాణాల్లోని ధరలపై కూడా దృష్టి సారించింది. ఎంజీబీఎస్‌లో 90కి పైగా స్టాల్స్ ఉండగా, ప్రస్తుతం 65 మాత్రమే నడుస్తున్నాయి. పండగ నేపథ్యంలో రద్దీ పెరగడంతో కొంతమంది ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయించారు. ఫిర్యాదులు అందడంతో ప్రయాణికుల్లా వస్తువులు కొనుగోలు చేశారు. అధిక ధరలు విక్రయించిన ఒక్కో స్టాల్‌కు రూ.1,000 జరిమానాతో నోటీసులు …
Read More »