Home / Tag Archives: ukraine

Tag Archives: ukraine

మరోసారి సంచలనం సృష్టించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌

తాము అనుకున్న  లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు గుప్పించారు. ఫార్ ఈస్టర్న్ పోర్ట్ సిటీ వ్లాడివోస్టాక్‌లో జరిగిన ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న పుతిన్‌.. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలోని రక్షించడమే ప్రధాన లక్ష్యమన్నారు. సైనిక చర్యను ప్రారంభించింది తాము కాదని, దాన్ని అంతం చేసేందుకు …

Read More »

ఘోరం.. బిల్డింగ్‌ కింద సుమారు 200 డెడ్‌బాడీలు..

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లోని చాలా పట్టణాలు, నగరాలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పోర్ట్‌ సిటీ మేరియుపోల్‌ తీవ్రంగా నష్టపోయింది. మూడునెలలుగా రష్యా జరుపుతున్న దాడిలో వందలాది మంది చనిపోయారు. ఆ నగరంలో తాజాగా భయానక వాతావరణం నెలకొంది. కూలిపోయిన ఓ భవనం కింద సుమారు 200 డెడ్‌బాడీలు లభ్యమయ్యాయి. భవనం శిథిలాలను కార్మికులు తొలగిస్తుండగా మృతదేహాలను గుర్తించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. డెడ్‌బాడీలు కుళ్లిపోయిన స్థితిలో …

Read More »

ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్

ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా  ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను  తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 …

Read More »

రష్యాకు అంతర్జాతీయ కోర్టు షాక్

గత రెండు వారాలుగా ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్న రష్యాకు అంతర్జాతీయ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈక్రమంలో బాంబులతో దాడులు చేస్తున్న రష్యాను  ఉక్రెయిన్ పై మిలటరీ దాడిని వెంటనే ఆపాలని అంతర్జాతీయ హైకోర్టు ఆదేశించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ దేశ బలగాలను వెనక్కి రప్పించాలని ఈ సందర్భంగా సూచించింది. దీనిపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ  అంతర్జాతీయ కోర్టులో తామే గెలిచాము. ఇంటర్నేషనల్ లా …

Read More »

ఉక్రెయిన్ లో చనిపోయిన నవీన్ గురించి బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక  బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర

 ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్‌ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్‌ స్కీతోపాటు.. ఉక్రెయిన్‌ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్‌ మేయర్‌, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్‌ చాంపియన్లు).. ఇలా 23 …

Read More »

ఒక్క ట్వీట్ తో రష్యాకు ముచ్చెమటలు పుట్టించిన ఎలాన్ మస్క్

ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం  కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ …

Read More »

రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?

గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …

Read More »

రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …

Read More »

ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కీలక సూచనలు

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat