Home / Tag Archives: Vladimir V. Putin of Russia

Tag Archives: Vladimir V. Putin of Russia

69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.

Read More »

అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన

గత రెండు వారాలుగా నడుస్తున్న ఉక్రెయిన్ తో భీకర యుద్ధం వేళ.. అణ్వాయుధాల వాడకంపై రష్యా కీలక ప్రకటన చేసింది. ‘మాకు ఒక జాతీయ భద్రతా విధానం ఉంది. ఉక్రెయిన్ పై సైనిక చర్య నేపథ్యంలో మా దేశానికి అస్థిత్వానికి ముప్పు ఏర్పడినప్పుడు మాత్రమే.. మా విధానానికి అనుగుణంగా మేం వాటిని ఉపయోగిస్తాం’ అని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. పేస్కోవ్ వ్యాఖ్యలను అమెరికా తప్పుబట్టింది. అణ్వాయుధ దేశమైన …

Read More »

రష్యాకు సామ్‌సంగ్‌ షాక్

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, నైక్‌, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్‌ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. …

Read More »

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం

ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్‌లో ప్ర‌సంగం చేయ‌డానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం వ‌చ్చింది. జూమ్ ద్వారా జ‌రిగే స‌భా కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతారు. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇటీవ‌ల జెలెన్‌స్కీతో ట‌చ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న స‌భ్యులంద‌రితో జెలెన్‌స్కీ మాట్లాడ‌నున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడ‌ర్ ఒక్‌సానా మ‌ర్క‌రోవా …

Read More »

పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన

రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.

Read More »

రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్

రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.

Read More »

ఉక్రెయిన్ యుద్ధం-6000 మంది రష్యన్లు మృతి

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.

Read More »

రష్యా కు షాక్ – ఐరాస సంచలన నిర్ణయం

ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన రష్యాను తొలగించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. భద్రతామండలిలో చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్ దేశాలు శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో పది సభ్య దేశాలను రెండేళ్ల కాలపరిమితితో సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఉక్రెయిన్ పై సైనిక చర్యను ఖండిస్తూ ఇటీవల ఓ తీర్మానం ప్రవేశపెట్టగా, రష్యా వీటో ద్వారా అడ్డుకుంది.

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్యకు 400 మంది కిరాయి గుండాలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ హత్య చేసేందుకు రష్యా 400 మంది కిరాయి గుండాలను సిద్ధంగా ఉంచిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. వారంతా వాగ్నర్ గ్రూప్ చెప్పుకుంటోన్న ప్రైవేటు మిలిషియాకు చెందినవారు. ఆ బృందాన్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో సహా 23 మంది ప్రభుత్వ పెద్దల్ని హత్య చేసేందుకు పుతిన్ నుంచి ఆదేశాలున్నట్లు ఆ సంచలన కథనం పేర్కొంది.

Read More »

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర

 ఒకవైపు వందలకొద్దీ యుద్ధ ట్యాంకులను దురాక్రమణకు నడిపిస్తూనే.. బాంబుల వర్షం కురిపిస్తూనే.. మరోవైపు చర్చలకు హాజరవుతున్న రష్యా.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీని హత్య చేయించేందుకు 400 మంది కిరాయి గూండాలను రంగంలోకి దింపిందంటూ యూకేకు చెందిన టైమ్స్‌ వార్తా సంస్థ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. జెలెన్‌ స్కీతోపాటు.. ఉక్రెయిన్‌ ప్రధాని, ఆయన కేబినెట్‌లోని మంత్రులు, కీవ్‌ మేయర్‌, ఆయన సోదరుడు (ఇద్దరూ బాక్సింగ్‌ చాంపియన్లు).. ఇలా 23 …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri