ఏపీ మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ రాజీనామా లేఖను ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపించారు. తన వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నానని, పార్టీ నేతలు అన్యథా భావించవద్దని ఆయన తన రాజీనామా లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న రావెల… కొన్ని నెలల …
Read More »చంద్రబాబు కుప్పంలో ఇల్లు కట్టుకోవడానికి పరుగెత్తాడు: జగన్ ఎద్దేవా
ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి లేదని ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజలను నమ్ముకుని ముందుకు సాగుతాడన్నారు. కానీ.. చంద్రబాబు మాత్రం మంగళగిరిలో ఓడిపోయిన సొంతపుత్రుడు.. రెండు చోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడిని నమ్ముకుని వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ జిల్లా మురమళ్లలో వైఎస్సార్ మత్స్యకార భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన …
Read More »AP నుండి రాజ్య సభ అభ్యర్థులు వీళ్ళేనా..?
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి వైసీపీ తరఫున అవకాశమివ్వాలని ఆ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయించారని ఏపీ రాజకీయాల్లో విన్పిస్తున్న వార్తలు. అంతేకాకుండా వైసీపీపీ నేత విజయసాయిరెడ్డిని రెండోసారి కూడా పార్లమెంటు ఎగువ సభకు పంపనున్నారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త …
Read More »కడుపుమంటతోనే టీడీపీ అనవసర రాద్ధాంతం: సజ్జల
రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కడుపుమంటతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఓడిపోయిన టీడీపీ నేతలను గడపగడపకు పంపాలని.. ధైర్యం ఉంటే వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సజ్జల సవాల్ …
Read More »అవాక్కైన నారా లోకేష్ -ఎందుకంటే..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి నారాయణ ఫోన్ ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రికార్డెడ్ గా చెప్పడం తనను నివ్వెరపోయేలా చేసిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ ప్రభుత్వం చట్టాలను విస్మరిస్తోందని ఆయన ఈ సందర్భంగా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఫోన్ నైన …
Read More »మళ్లీ మా 151 సీట్లు మాకే: కొడాలి నాని
జగన్ రాజకీయాల్లో లేకపోతే ఇళ్ల కోసం పేదల ప్రజలు అల్లాడిపోయేవారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్ కోసం పేద ప్రజలంతా ఒకే వేదికపైకి రావాలని పిలుపునిచ్చారు. గుడివాడలో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదన్నారు. తన నియోజకవర్గంలో తనకు ఇల్లు లేదని ఏ ఒక్క పేదవాడు అడిగినా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని …
Read More »అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల
ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్ …
Read More »పవన్.. ప్రజలకైనా ఓ క్లారిటీ ఇవ్వు: పెద్దిరెడ్డి
2024 ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుకోక తప్పదని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు ప్రజల్లో విశ్వసనీయత లేదని.. ఒంటరిగా పోటీ చేస్తే గెలవడం సాధ్యం కాదని ఆయనకీ తెలుసన్నారు. అందుకే పొత్తుల కోసం చేయాల్సిన అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నారని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. జగన్‌కు ప్రజల్లో అభిమానం ఉందని.. అందుకే వైసీపీ ధైర్యంగా ఒంటరిగా పోటీ …
Read More »పొత్తులపై ప్రజల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నారు: సజ్జల
ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వమని చెప్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. టీడీపీతో పొత్తు ఉంటుందా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పొత్తులపై జనసేన, టీడీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయన్నారు. వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధం అంటూ కూటమినే నడిపిస్తామని చెప్పడమేంటని సజ్జల …
Read More »క్విట్ ఏపీ.. క్విట్ మంగళగిరి అని వాళ్లిద్దరినీ పంపించేశారు: వైవీ సుబ్బారెడ్డి
కరోనా సమయంలోనూ సీఎం జగన్ ప్రజలపై ఆర్థికభారం పడకుండా కాపాడారని టీటీడీ ఛైర్మన్, ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. జగన్ పాలన చూసి మూడేళ్లుగా నిద్రపోయిన చంద్రబాబు, లోకేశ్ ఇప్పుడు బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడారు. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారంటే అది వైసీపీ కార్యకర్తల సహకారమేనని చెప్పారు. 2014- 2019 వరకు చంద్రబాబు …
Read More »