ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 70 వ వనమహోత్సవ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా…అడవుల పెంనకమే లక్ష్యంగా చేపట్టిన ఈ వన మహోత్సవ కార్యక్రమం లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో విద్యార్థులతో కలిసి సీఎం జగన్ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలను ప్రారంభించారు. …
Read More »సంచలనం….హైకోర్ట్‌లో యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్ష్యం..!
గ త ఐదేళ్లలో చంద్రబాబు, లోకేష్‌ల అండతో, అధికారంలో ఉన్నామనే అహంకారంతో అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల్లో ఇరుక్కుంటున్నారు..కోడెల, సోమిరెడ్డి, కూన రవికుమార్, కరణం బలరాం, యరపతినేని శ్రీనివాసరావు..ఇలా వరుసగా టీడీపీ నేతలు ముద్దాయిలుగా కోర్టుల ముందు నిలబడుతున్నారు. తాజాగా అక్రమ మైనింగ్ కేసులో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉచ్చు బిగుసుకుంటోంది. సున్నపు రాయి అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చు …
Read More »అమరావతిపై చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్ల పరువు తీసిన జాతీయ మీడియా…!
గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని…నిర్మాణాలకు అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుందన్న మంత్రి బొత్స వ్యాఖ్యలను ఎల్లోమీడియా ఛానళ్లు వక్రీకరించాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తుందంటూ…భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయబోతుందంటూ…పచ్చ మీడియా ఛానళ్లు కథనాలు వండి …
Read More »సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామ సచివాలయాలలో మహిళా పోలీసులను నియమించి అక్రమ మద్యం ,నాటు సారాలను అరికట్టే చర్యలు చేపడతామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగం బాగా తగ్గిందన్నారు. అక్టోబరు నుంచి 20 శాతం మద్యం దుకాణాలు, బార్లను తగ్గించడమే కాకుండా, దశలవారీగా మద్య నిషేధం అమలుకి అడుగులు వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఈ …
Read More »సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో 5 మంది అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలో కోర్టు ఆదేశాలతో ఐదుగురిని రిమాండ్‌కు తరలించినట్లు కార్వేటినగరం ఎస్ఐ ప్రియాంక తెలిపారు.ఆమె తెలిపిన వివరాల ప్రకారం… టీడీపీ నేత, కార్వేటినగరం మాజీ ఎంపీపీ జనార్దనరాజు ఈనెల 26న తన అనుచరులు అణ్ణామలై, శ్రీనివాసులు, సూర్యప్రకాష్‌రెడ్డి, శ్యామరాజుతో కలసి విహారయాత్రకు తలకోన వెళ్లారు. అక్కడ మద్యం మత్తులో సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. …
Read More »బ్రేకింగ్…విమానంలో సాంకేతిక లోపాలు.. మెగాస్టార్ చిరంజీవికి తప్పిన పెనుప్రమాదం…!
మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ …
Read More »ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జేకే మహేశ్వరి!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్ జె.కె.మహేశ్వరిని నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేసింది. జస్టిస్ మహేశ్వరి ప్రస్తుతం మధ్యప్రదేశ్ హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్రం ఆ సిఫారసును వెనక్కి పంపింది. ఈ నేపథ్యంలో తాజాగా భేటీ అయిన సుప్రీం కోర్టు …
Read More »జనసేనాని టూర్లో టీడీపీ నేతలు..!
వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ గత కొద్ది రోజులగా చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే రాజధాని అని స్పష్టం చేసినా..బాబు మాత్రం ఇంకా రాజధానిపై రైతులను రెచ్చగొట్టే పనిలోనే ఉన్నాడు. ఇక ఏపీ .బీజేపీ నేతలు కూడా మొదట్లో కాస్త రాజధానిపై హడావుడి చేశారు…ముఖ్యంగా చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అమరావతిలో పర్యటించి …
Read More »విశాఖ డెయిరీ చైర్మన్ తో పాటు 12 మంది డైరెక్టర్లతో కూడిన బృందం రేపు వైసీపీలోకి
ముప్పై ఏళ్ళుగా టీడీపీ గుప్పట్లో ఉన్న విశాఖ డైరీ ఇక వైసీపీ చేతిలోకి మారనుంది. అందుకు కారణం విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్, తన 12 మంది డైరెక్టర్లతో కూడిన బృందం వైసీపీ లో చేరాలని నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు . ఈ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సెప్టెంబర్ 1న విజయవాడలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో …
Read More »ఏపీలో రేపే గ్రామ సచివాలయం పరీక్షలు..షెడ్యూలు ఇదే..
ఏపీలోని అన్ని జిల్లాలో గ్రామ సచివాలయం పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ప్రశ్నపత్రాలు జిల్లాలకు చేరాయి. కలెక్టరేట్లోని స్ట్రాంగ్‌రూంలలో భద్రపరిచారు. అన్ని జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాల పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షల షెడ్యూలు ఇదే.. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 2, 5 తేదీలు మినహా మిగిలిన తేదీల్లో నిర్వహించే …
Read More »