Home / SLIDER / మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో  అధికార కాంగ్రెస్‌ పార్టీ సమావేశం నిర్వహిస్తున్నది. దీంతో నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌ నుంచి అచ్చంపేట వెళ్తుండగా వెల్దండ వద్ద అడ్డుకున్న పోలీసులు.. మాజీ ఎమ్మెల్యేను పీఎస్‌కు తరలించారు.విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.

బాలరాజు విడుదల చేయాలని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, పోలీసులను అడ్డుపెట్టుకొని బీఆర్‌ఎస్‌ నాయకులను అణచివేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat