సంస్థ నిర్వాహణ లో భాగంగా వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ప్రతినిధి నిన్న శుక్రవారం వెల్లడించారు. మొత్తం ఉద్యోగుల్లో ఇది దాదాపు 15 శాతానికి సమానం. ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి మీషో వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్ ఆత్రే ఈమెయిల్ పంపించారు.ఈ …
Read More »జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ పై సీబీఐ దాడులు
ప్రముఖ విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ నివాసం, సంస్థ పాత కార్యాలయాలు సహా పలు ప్రాంతాల్లో నిన్న శుక్రవారం సీబీఐ సోదాలు నిర్వహించింది. ప్రముఖ బ్యాంకు అయిన కెనరా బ్యాంకును రూ.538 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలపై నరేశ్ గోయల్‌తో పాటు పలువురిపై సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నది. ఇందులో భాగంగానే దేశంలో ఉన్న ఢిల్లీ, ముంబై సహా పలు ప్రాంతాల్లోని …
Read More »స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. సెనెక్స్ 74.61 పాయింట్ల లాభంతో 60,130.71 పాయింట్ల వద్ద ముగిసింది. మరో వైపు నిఫ్టీ 25.85 పాయింట్ల లాభంతో 17,769.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సానుకూల పవనాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. ఉదయం సెన్సెక్స్ 60,202 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత …
Read More »రూ. 2.3 లక్షల కోట్లకు చేరిన అదానీ అప్పులు
అఖండ భారత రాజకీయాలను షేక్ చేసిన అమెరికా షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదిక ఆరోపణలతో అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 12 లక్షల కోట్ల మేర నష్టపోయింది. ఇదే సమయంలో అదానీ గ్రూప్ ఎడాపెడా అప్పులు చేసుకొంటూపోతున్నది. ఏడాది వ్యవధిలో అదానీ గ్రూప్ 20.7 శాతం మేర ఎక్కువ రుణాలు తీసుకొన్నదని, దీంతో మార్చి 31 నాటికి గ్రూపులోని 7 నమోదిత కంపెనీల రుణాలు రూ. 2.3 లక్షల …
Read More »తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.
Read More »మళ్లీ ఆకాశాన్నంటిన బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగింది. మరోవైపు వెండి ధర దాదాపు రూ.3వేలు పెరిగింది. బుధవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.56,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 కి చేరింది. కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.80,700 కి చేరుకుంది.
Read More »వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేశాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 91.50 తగ్గించింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,233కు చేరింది. అయితే గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ప్రతి నెలా ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే.
Read More »వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిలో అజయ్ బంగా
భారత సంతతి వ్యక్తి అయిన అజయ్ బంగా వరల్డ్ బ్యాంక్ అత్యున్నత పదవిని చేపట్టనున్నారు. ఏ దేశమూ ప్రత్యామ్నాయ అభ్యర్థిని ప్రతిపాదించకపోవడంతో బంగా నామినేషన్ ఒక్కటే మిగిలింది. దీంతో బంగా నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ దాదాపు ఒక సంవత్సరం ముందుగానే పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించడంతో గత నెలలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగా పేరును ప్రతిపాదించారు.
Read More »అరుదైన ఘనత సాధించిన ఎలాన్ మస్క్
సోషల్ మీడియా మాధ్యమమైన ట్విటర్, స్పేసెక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విటర్ లో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు కల్గిన వ్యక్తిగా అవతరించారు. 133 మిలియన్లతో అగ్రస్థానంలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను మస్క్ వెనక్కి నెట్టారు. వీరి తర్వాత జస్టిన్ బీబర్, క్యాటీ పెర్రీ, రిహన్నా, క్రిస్టియానో రొనాల్డో, టేలర్ స్విఫ్ట్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు.
Read More »హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా
హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ . నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ. నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ …
Read More »