Home / SPORTS

SPORTS

రాహుల్ దూకుడు

అద్భుత ఆల్‌రౌండ్‌ షోతో అలరించిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ బోణీ చేసింది. ముందుగా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 132 నాటౌట్‌) అజేయ శతకంతో భారీ స్కోరుకు బాటలు వేయగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ఎం.అశ్విన్‌ (3/21), రవి బిష్ణోయ్‌ (3/32) సుడులు తిరిగే బంతులకు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కోలుకోలేకపోయింది. ఫలితంగా పంజాబ్‌ ఏకంగా 97 పరుగుల తేడాతో ఘనవిజయం సా …

Read More »

ఐపీల్ లో డ్రగ్స్ కలవరం

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణంపై దర్యాప్తు జరుగుతున్న తరుణంలో నటి షెర్లిన్‌ చోప్రా సంచలన విషయం వెల్లడించింది. ఐపీఎల్‌ మ్యాచ్‌ల తర్వాత జరిగే పార్టీల్లో డ్రగ్స్‌ ఉపయోగించేవారని తెలిపింది. ఓసారి ఈ దృశ్యాని తాను చూశానని పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘గతం లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌ తర్వాత జరిగిన పార్టీకి హాజరయ్యా. ప్రముఖ క్రికెటర్లు, వారి భార్యలు …

Read More »

అంతర్జాతీయ క్రికెట్‌కు ఉమర్‌ గుల్‌ గుడ్‌బై

పాకిస్థాన్‌ వెటరన్‌ పేసర్‌ ఉమర్‌ గుల్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు 36 ఏళ్ల గుల్‌ ప్రకటించాడు. రిటైర్మెంట్‌ అనంతరం కోచ్‌గా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. త్వరలో జరగనున్న జాతీయ టీ20 కప్‌.. ఆటగాడిగా అతడికి ఆఖరిది. 2003లో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఉమర్‌.. అదే ఏడాది టెస్ట్‌ జ ట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. 2016లో ఇంగ్లండ్‌పై చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. …

Read More »

రో”హిట్” మ్యాన్ షో

ముంబాయి ఇండియన్స్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (54 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 80) అర్ధ శతకంతో విరుచుకుపడడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ బోణీ చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ముంబై 49 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (28 బంతుల్లో 47) రాణించాడు. యువ పేసర్‌ శివమ్‌ …

Read More »

పోరాడి ఓడిన హైదరాబాద్

ప్రేక్షకులు లేరన్న లోటే ఉంది కానీ… ఐపీఎల్‌–2020 టోర్నీలో బోలెడంత థ్రిల్‌ రోజూ అందుతోంది. రెండో మ్యాచ్‌ ‘సూపర్‌’దాగా సాగితే… మూడో మ్యాచ్‌ ‘బౌల్డ్‌’ మలుపులు తిరిగింది. పటిష్టమనుకున్న స్కోరే తర్వాత పలుచన అయింది. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ సాగిలపడిపోయింది. సోమవారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టును ఓడించి బోణీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు …

Read More »

ధోనీ నిర్ణయానికి షాక్

డిఫెండింగ్‌ చాంప్‌ ముంబై ఇండియన్స్‌తో ఆరంభ మ్యాచ్‌లో నెగ్గిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఐపీఎల్‌లో బోణీ చేసింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా అవుటైన తర్వాత ధోనీ బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. కానీ, సామ్‌ కర్రాన్‌ను తనకంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపి మహీ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 17 బంతుల్లో విజయానికి 29 పరుగులు కావాల్సిన సమయంలో కర్రాన్‌ (6 బంతుల్లో 18) ధాటిగా ఆడి చెన్నై …

Read More »

ఢిల్లీ సూపర్ విజయం

అటు స్టొయినిస్‌..ఇటు మయాంక్‌ అగర్వాల్‌ అసాధారణ ఆటతీరుతో అభిమానులకు అసలు సిసలు మజాను చూపించారు. కానీ చివరకు పంజాబ్‌ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 20 ఓవర్లలో 157 పరుగులే చేయడంతో టైగా ముగిసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. దీంట్లో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ అదిరే బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు …

Read More »

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యే

గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్‌తో గెలిచిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌… ‘అనధికారికం’గా వైసీపీలో చేరిపోయారు. ఆయన శనివారం తన ఇద్దరు కుమారులతో కలిసి సీఎం జగన్‌ను కలిశారు. వాసుపల్లి కుమారులకు జగన్‌ వైసీపీ కండువాలు కప్పారు. ఆ పక్కనే వాసుపల్లి నిలుచున్నారు. ఈ కార్యక్రమం ముగించుకుని బయటకు వచ్చాక.. ‘‘నా కుమారులు వైసీపీలో చేరడం ఆనందంగా ఉంది. జగన్‌ గట్స్‌ ఉన్న నాయకుడు’’ అని ప్రశంసించారు. …

Read More »

రాయుడు విజృంభణ

ఐపీఎల్‌-13వ సీజన్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఘనంగా ఆరంభించింది. కీలక ఆటగాళ్లు లేకపోయినా.. జట్టుకు తగిన ప్రాక్టీస్‌ లభించకపోయినా ఏమాత్రం ఒత్తిడికి లోను కాని ఎంఎస్‌ ధోనీ సేన 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది. దీంతో వరుసగా ఐదు పరాజయాల తర్వాత ముంబైపై ప్రతీకారం తీర్చుకున్నట్టయింది. అంబటి రాయుడు (48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 71), డుప్లెసి (44 బంతుల్లో 6 ఫోర్లతో 58 …

Read More »

యూవీ 6సిక్సర్లకు పదమూడేళ్లు

2007 టీ20 వరల్డ్‌క్‌పలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వీరవిహారం క్రికెట్‌ అభిమానుల మదిలో చెదరని జ్ఞాపకం. ఇంగ్లండ్‌తో లీగ్‌ మ్యాచ్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో యువీ ఆరు సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ అద్భుతం జరిగి శనివారానికి పదమూడేళ్లు. ఆ సందర్భాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా యువీ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌ సందర్భంగా తన స్టిల్‌ ఫొటోను పోస్ట్‌ చేసిన యువీ.. ‘సమయం …

Read More »