Home / TELANGANA

TELANGANA

తెలంగాణలో కరోన తగ్గుముఖం

తెలంగాణలో నిన్న 21,893 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య సంఖ్య 2,91,872కి చేరింది. ఇందులో 4,049 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటివరకు 2,86,244 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఇద్దరు మృతిచెందగా, మొత్తం 1,579 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 74,83,580 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

Read More »

తెలంగాణలో 324కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు

తెలంగాణ వ్యాప్తంగా 324 కేంద్రాల్లో నేడు కొవిడ్ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు. ప్రతి సెంటర్లో 50 మంది వ్యాక్సిన్ వేసుకోనున్నారు. టీకా తీసుకొనే వైద్య సిబ్బంది వివరాలు ఇప్పటికే కొవిన్ సాఫ్ట్ వేర్ లో నమోదైయ్యాయి..

Read More »

కవులు,రచయితలను గుర్తించిందే సీఎం కేసీఆర్

కవులు, రచయితలను గుర్తించి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌ ఒక్కరికే దక్కుతుందని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. 25 ఏండ్లలో కవులను, రచయితలను ఎవరూ గుర్తించలేదని, తన పాట, కవిత, రచనలను గుర్తించి ముఖ్యమంత్రి తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట ‘బీ’ బ్లాక్‌ ముంతాజ్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌, కవి యాకూబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డు-2020 (షేక్‌ మహమ్మద్‌ మియా, కేఎల్‌ …

Read More »

సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(CDS) భవనాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల

హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో …

Read More »

ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్

ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్ర‌జ‌ల‌కు ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీ భోగి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ను దోచేసుకున్నారు. ఈ ప్ర‌త్యేక రోజు అంద‌రి జీవితాల్లోకి భోగ‌భాగ్యాల‌ను, ఆయురారోగ్యాల‌ను తీసుకురావాల‌ని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More »

భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత

భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ  రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …

Read More »

హైద‌రాబాద్‌కు చేరుకున్న క‌రోనా టీకా

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్ర‌క్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 6.5 ల‌క్ష‌ల డోసుల కొవిడ్‌ టీకాలు ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి టీకా డోసుల‌ను త‌ర‌లించ‌నున్నారు. కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో …

Read More »

మంత్రి ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ ప్రశంసలు

పల్లె ప్రగతి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక కృషి చేసి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి అభినందించారు. మంత్రి దయాకర్ రావుతోపాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, ఇతర అధికారులను ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక శ్రద్ధతో పల్లె ప్రగతి పనులను …

Read More »

అద్భుతంగా పల్లె ప్రగతి : సీఎం కేసిఆర్

‘పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ మంచినీరు సమకూరుతున్నాయి. ఇది దేశంలో మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన నాడు …

Read More »