ఒకవైపు యాంకర్ గా రాణిస్తూనే అప్పుడప్పుడూ సినిమాల్లో తతుక్కుమంటున్న అనసూయ భరద్వాజ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పెషల్ సాంగ్స్ లో నటించొద్దని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్తికేయ ‘చావు కబురు చల్లగా’లో ఈమె స్పెషల్ సాంగ్ లో కన్పించింది. తన స్నేహితుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అందులో నటించానని.. ఇకపై నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేస్తానని ఆమె చెప్పింది.
Read More »TimeLine Layout
February, 2021
-
22 February
మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష
మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటించనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ఈ రీమేక్ లో త్రిష హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, రచయిత లక్ష్మి భూపాల్ డైలాగ్స్ రాస్తున్నాడు.
Read More » -
22 February
బీజేపీలోకి పీటీ ఉష
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Read More » -
22 February
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.
Read More » -
22 February
మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి బాధ్య తలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని, కె.కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి తన కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 11న జరిగిన బల్దియా మేయర్ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్గా గెలుపొందిన విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా శ్రీలత …
Read More » -
22 February
బ్రౌన్ రైతో లాభాలెన్నో..?
బ్రౌన్ రైతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. తక్షణ శక్తి లభిస్తుంది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది త్వరగా బరువు తగ్గుతారు మతిమరుపుని నివారిస్తుంది మధుమేహాన్ని అదుపు చేస్తుంది ఎముకలను దృఢంగా చేస్తుంది కిడ్నీల్లో రాళ్లను నివారిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
Read More » -
22 February
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్ మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. బయో ఏషియా-2021 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. టీకాల రాజధానిగా హైదరాబాద్ అని చెప్పుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ సంస్థ కొవార్టిన్ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని అన్నారు..
Read More » -
22 February
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాణీ దేవి
తెలంగాణలో మార్చి 14న జరగనున్న రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ఎంపిక చేశారు. అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం పీవీ నరసింహారావు కూతురు వాణీ దేవికి ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఈ మేరకు ప్రగతి భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వాణి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పారు. సమావేశం …
Read More » -
22 February
చంద్రబాబు సంతోషం.. ఎందుకంటే..?
ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు వీరోచితంగా పోరాడారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. 4వ విడతలో 1,136 పంచాయతీల్లో విజయం సాధించామని అన్నారు.. మొత్తం నాలుగు విడతల్లో 4,230 పంచాయతీలను గెలుచుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని, అరాచకాలు సృష్టించిందన్నారు. ఎన్నికలను SEC సక్రమంగా నిర్వహించలేదని చంద్రబాబు ఆరోపించారు.
Read More » -
21 February
మరో సారి సత్తా చాటనున్న విజయశాంతి
అటు గ్లామరస్ పాత్రల్లోనూ, ఇటు పవర్‌ఫుల్ పాత్రల్లోనూ నటించి లేడీ అమితాబ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు సీనియర్ హీరోయిన్ విజయశాంతి. ఒకవైపు స్టార్ హీరోల సినిమాల్లో కమర్షియల్ హీరోయిన్‌గానూ, ఆ తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల కథానాయికగానూ సత్తా చాటారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి వెండితెరకు దూరమయ్యారు. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన `సరిలేరు నీకెవ్వరు` సినిమాతో పునరాగమనం చేశారు. ఆ సినిమాలో ఓ …
Read More »