TimeLine Layout

February, 2021

  • 2 February

    మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

    ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను బెదిరించిన కేసులో అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నరు పోలీసులు. అనంతరం ఆయన్ని కోటబొమ్మాళి PSకు తరలించారు. అటు అప్పన్నను పరామర్శించేందుకు అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కాసేపట్లో నిమ్మాడకు రానున్నారు.

    Read More »
  • 1 February

    కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం

    ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ బడ్జెట్ లో కొత్తగా పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం’ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఈ మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అటు దేశంలో కొత్తగా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పుణెలో మాత్రమే ఈ తరహా ల్యాబ్ ఉంది.

    Read More »
  • 1 February

    రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త

    వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.

    Read More »
  • 1 February

    కేంద్ర బడ్జెట్ 2021-22-మొబైల్ వినియోగదారులకు షాక్

    కేంద్ర బడ్జెట్ లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పై 2.5% కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అటు కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలులోకి రానుండగా.. అప్పటి నుంచి ధరలు పెరుగుతాయి.

    Read More »
  • 1 February

    ఆ పథకాన్ని మరో ఏడాది పొడిగించిన కేంద్రం

    ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో 2022 మార్చి 31 వరకు గృహాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. అలాగే అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పెరగనుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై కేంద్రం రాయితీ అందిస్తోంది.

    Read More »
  • 1 February

    సామాన్యుడికి షాకిచ్చిన 2021-22కేంద్ర బడ్జెట్

    బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది

    Read More »
  • 1 February

    కేంద్ర బ‌డ్జెట్ 2021-22తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే..?

    -త‌గ్గ‌నున్న బంగారం, వెండి ధ‌ర‌లు -పెర‌గ‌నున్న కార్ల విడిభాగాల ధ‌ర‌లు -మొబైల్ రేట్లు పెరిగే అవ‌కాశం -నైలాన్ దుస్తుల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం -సోలార్ ఇన్వ‌ర్ట‌ర్ల‌పై ప‌న్ను పెంపు -ఇంపోర్టెడ్ దుస్తులు మ‌రింత ప్రియం

    Read More »
  • 1 February

    వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు‌ ఎందుకంటే..?

    దేశంలోని ల‌బ్ధిదారుల సౌక‌ర్యం కోస‌మే దేశంలో వ‌న్ నేష‌న్ వ‌న్ రేష‌న్ కార్డు స్కీమ్‌ను అమ‌ల్లోకి తెచ్చామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. ఈ ప‌థ‌కంవ‌ల్ల ల‌బ్ధిదారుడు ఏ రాష్ట్రం, ఏ ప్రాంతానికి చెందిన వాడైనా మ‌రే ఇత‌ర ప్రాంతం లేదా రాష్ట్రం నుంచైనా స‌రుకులు తీసుకునే సౌక‌ర్యం క‌లిగింద‌ని ఆమె తెలిపారు. ముఖ్యంగా బ‌తుకుదెరువు కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లే వ‌ల‌స కార్మికుల‌కు ఈ ప‌థ‌కం …

    Read More »
  • 1 February

    స్వ‌స్త్ భార‌త్ హెల్త్ స్కీమ్ కి ఎన్ని కోట్లు కేటాయించారంటే..?

    ఆరోగ్య భార‌త్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం కొత్త స్కీమ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది.  ప్ర‌ధాన‌మంత్రి ఆత్మ‌నిర్బ‌ర్ స్వ‌స్త్ భార‌త్ యోజ‌న పేరుతో ఆ స్కీమ్‌ను అమ‌లు చేయ‌నున్నారు.  ఈ కొత్త ప‌థ‌కం కోసం 64,180 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఆరేళ్ల పాటు ఆ స్కీమ్ కోసం ఈ మొత్తాన్ని ఖ‌ర్చు చేస్తారు. ఆరోగ్యం విష‌యంలో కేంద్రం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్న‌ట్లు కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.  ఇవాళ ఆమె లోక్‌స‌భ‌లో బ‌డ్జెట్ …

    Read More »
  • 1 February

    కేంద్ర బడ్జెట్ 2021 -రైల్వేల‌కు రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు

    అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా భార‌తీయ రైల్వేల‌ను అభివృద్ది చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌ర్కార్ నిర్ణ‌యించింది. అందుకోసం రైల్వే రంగంలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.1.15 ల‌క్ష‌ల కోట్ల నిధులు అందించ‌నున్నారు. దేశీయ విమానాశ్ర‌యాల‌ను పూర్తిగా ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat