TimeLine Layout

February, 2021

  • 1 February

    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టాబ్లెట్‌లో ఏముందో తెలుసా..?

    క‌రోనా నేప‌థ్యంలో తొలిసారి డిజిట‌ల్ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. స్వ‌దేశీ ‘బాహి  ఖాతా (బడ్జెట్‌)’ను టాబ్లెట్‌లో స‌మ‌ర్పించారు. ప‌సిడి వ‌ర్ణంతో కూడిన మూడుచ‌క్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ క‌ల‌ర్ బ్యాగ్‌లో బ‌డ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్ల‌మెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ చీర ధ‌రించి, ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, ఇత‌ర ఆర్థిక శాఖ అధికారులు వెంట‌రాగాపార్ల‌మెంట్‌లో అడుగు …

    Read More »
  • 1 February

    KGF-2 విడుదల రోజు సెలవు కావాలంటూ ప్రధాని మోదీకి లేఖ

    కేజీఎఫ్ అనే క‌న్న‌డ చిత్రం దేశ వ్యాప్తంగా ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దాదాపు 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి అంద‌రి దృష్టి ఆకర్షించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 మూవీపై కూడా అభిమానుల‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే షూటింగ్  పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, సినిమాకు సంబంధించి భారీగా బిజినెస్ జ‌రుగుతుంది. మ‌రోవైపు కేజీఎఫ్ …

    Read More »
  • 1 February

    కార్యకర్త కుటుంబానికి రెండు లక్షల ఇన్సూరెన్స్ అందజేసిన మంత్రి జగదీష్

    నమ్ముకున్న క్యాడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేదే టి ఆర్ ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఎంతో ముందు చూపుతో యావత్ భారతదేశంలో మొట్టమొదటి సారిగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టి ఆర్ ఎస్ అధినేత పార్టీ సభ్యత్వానికి భీమా పాలసీ అమలులోకి తెచ్చారని ఆయన చెప్పారు.క్యాడర్ కు లీడర్ కు ఇప్పుడు అదే భరోసాగా మారిందని ఆయన స్పష్టం చేశారు. …

    Read More »
  • 1 February

    హీరోలపై సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న బక్కపలచు భామ సాయి పల్లవి తనతో కలిసి నటించిన కొందరు హీరోల గురించి  ఇటీవల పలు విషయాలు పంచుకుంది. తెలుగులో తన తొలి సినిమా ‘ఫిదా’ హీరో వరుణ్ తేజ్ తనకు వెరీ స్పెషల్ అని, అతడి నటనకు ‘ఫిదా’ అయ్యా నని చెప్పింది. ఇక ధనుష్(మారి) తన టెన్షన్ పోగొట్టేవాడంది. తన అభిమాన నటుడు సూర్య (NGK)తో నటించడంతో …

    Read More »
  • 1 February

    మంత్రి కేటీఆర్ కల ఏంటో తెలుసా..?

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే  రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ   హైస్కూలును సీఎస్ఆర్  కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు. కార్పొరేట్ …

    Read More »
  • 1 February

    కమెడియన్ కు జోడిగా సాయిపల్లవి

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్య‌మైన క‌థా చిత్రాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిప‌ల్ల‌వి.. ఇప్పుడు తెలుగులో విరాట ప‌ర్వం, శ్యామ్ సింగ‌రాయ్ చిత్రాల్లో న‌టిస్తుంది. భారీ చిత్రాల్లో న‌టిస్తున్న సాయిప‌ల్ల‌వి ఓ ఎక్స్‌పెరిమెంట్‌కు తెర తీస్తుంద‌ట‌. తమిళంలో చేయ‌బోయే ఓ సినిమాలో సాయిపల్లవి క‌మెడియ‌న్ స‌ర‌స‌న న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌మాచారం మేర‌కు త‌మిళంలో క‌మెడియ‌న్‌గా పేరు తెచ్చుకున్న కాళి వెంక‌ట్ జోడీగా సాయిప‌ల్ల‌విని న‌టింప …

    Read More »
  • 1 February

    మా ఓపిక నశిస్తే,బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేరు-అనిల్ కూర్మాచలం

     పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఎన్నారై టీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి భౌతిక దాడులు  ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంపై నోరుమెదపలేని బిజెపి నాయకులకు మతవిద్వేషాలు రెచ్చగొట్టే విషయాల్లో అనవసరమైన అత్యుసాహాన్ని ప్రదర్శిస్తున్నారని అనిల్ కూర్మాచలం ‌తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చెయ్యకుండా పోరాటం చేసిన చరిత్ర  టీ.ఆర్.యాస్  పార్టీదని, ఇలా ప్రజలని …

    Read More »
  • 1 February

    బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, …

    Read More »
  • 1 February

    కాళేశ్వరం ప్రాజెక్టులో కొనసాగుతున్న ఎత్తిపోతలు

    తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్‌-1 పరిధిలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్‌లో 5 పంపులతో 10,500 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. సరస్వతి పంపుహౌస్‌లో 4 మోటర్ల ద్వారా 11,720 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్‌లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి పంపుహౌస్‌లో ఆరు మోటర్ల ద్వారా 12,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడినుంచి నంది రిజర్వాయర్‌కు.. ఇక్కడి మూడు మోటర్లతో 9,450 క్యూసెక్కుల నీటిని …

    Read More »
  • 1 February

    తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం

    తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్‌ బియ్యం పంపిణీలో  కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్‌ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్‌బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్‌ నంబరు మాత్రమే ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్‌ నంబర్‌ ఆధార్‌తో అనుసంధానం ఉంటే …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat