తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 643 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కు చేరింది. వైరస్ నుంచి తాజాగా 805 మంది కోలుకున్నారు.. ఇప్పటి వరకు 2,66,925 మంది డిశ్చార్జి అయ్యారు. మరో ఇద్దరు వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. ఇప్పటి వరకు 1482 మంది మృత్యువాతపడ్డారు. మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉండగా.. దేశంలో …
Read More »TimeLine Layout
December, 2020
-
10 December
నేడు సిద్దిపేటకు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ ఇవాళ సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రూ.1200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు మర్కూక్ మండలం ఎర్రవల్లి నుంచి సీఎం కేసీఆర్ బయల్దేరుతారు. ఉదయం 11 గంటలకు సిద్దిపేట శివారులో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.20 గంటలకు పొన్నాలలో కొత్తగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11.40 గంటలకు మిట్టపల్లిలో నూతనంగా నిర్మించిన …
Read More » -
9 December
రాజకీయాల్లోకి రాశీఖన్నా..!
ఏడేండ్లుగా తన అందం, అభినయంతో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఢిల్లీ భామ రాశీఖన్నా. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం తమిళ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన ఈ భామ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసే ఓ విషయం చెప్పింది. ఇంతకీ ఆ విషయమేంటనుకుంటున్నారా..? రాశీఖన్నా కోలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలిటిక్స్ గురించి మాట్లాడింది. ‘చిన్నప్పటి నుంచి నాకు …
Read More » -
9 December
హైదరాబాద్ చేరుకున్న 64 దేశాల రాయబారులు
మరికాసేపట్లో శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీకి 64 దేశాల రాయబారులు, హైకమిషనర్ల బృందం చేరుకోనుంది. వీరు రెండు గ్రూపులుగా విడిపోయి.. భారత్ బయోటెక్, బయోలాజికల్-ఈ సంస్థలను సందర్శించి కోవిడ్ టీకాలపై చర్చించనున్నారు. టీకాల తయారీపై ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ బృందాలు తిలకించనున్నాయి. టీకాల పురోగతిని తెలుసుకున్న అనంతరం శాస్ర్తవేత్తలతో రాయబారులు, హైకమిషనర్లు భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు రాయబారులు, హైకమిషనర్లు ఢిల్లీ బయల్దేరనున్నారు. విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో రాష్ట్ర …
Read More » -
9 December
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉదయం లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి ఈ నెల 10న ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో కేసీఆర్ అభినందనలు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తుండటం గర్వకారణంగా ఉందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వభౌమత్వానికి గర్వకారణమని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టాల్సి ఉండే.. ప్రస్తుతమున్న …
Read More » -
9 December
తొలిసారిగా కాజల్ అగర్వాల్ సరికొత్తగా
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ ఇటీవలే మాల్దీవుల్లో హనీమూన్ యాత్రను ముగించుకొని వచ్చింది. చిరకాల ప్రియుడు గౌతమ్ కిచ్లును గత నెలలో ఆమె వివాహమాడిన విషయం తెలిసిందే. హనీమూన్ ముగియడంతో ఇక సినిమాలపై దృష్టిపెట్టబోతున్నది కాజల్ అగర్వాల్. తాజాగా తమిళంలో ఆమె ఓ హారర్ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్రానికి ‘ఘోస్టీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. డీకే దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నలుగురు కథానాయికల్లో ఒకరిగా కాజల్ …
Read More » -
9 December
నటి వీజే చిత్ర ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చైన్నైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తమిళ టీవీ నటి వీజే చిత్ర (28) ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సిరీస్‌లో ముల్లా పాత్రను పోషించి ఎంతో పేరు తెచ్చుకుంది. 2013 లో పీపుల్స్ టెలివిజన్‌లో వాట్ ది లా సేస్‌పై వ్యాఖ్యాతగా టీవీ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సన్ టీవీలో ప్రసారమైన లిటిల్ డాడీ, బిగ్ డాడీ సిరీస్‌లో నటించింది. సినిమాల్లో …
Read More » -
9 December
దేశంలో మళ్లీ కరోనా కలవరం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 32,080 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటికంటే 21 శాతం ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న దేశంలో 26,567 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 97,35,850కి చేరాయి. ఇందులో 3,78,909 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు 92,15,581 మంది బాధితులు కోలుకున్నారు. ఇందులో గత 24 …
Read More » -
9 December
GHMC Results Update-నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిలిచిన నేరెడ్‌మెట్ ఫలితం వెల్లడి అయింది. నేరెడ్‌మెట్ 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది. నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని …
Read More » -
8 December
రైతన్నకు అండగా దేశం
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా భారత్ బంద్ విజయవంతంగా కొనసాగింది. సబ్బండ వర్ణాలు రైతన్నకు అండగా నిలిచారు. యావత్ దేశం ఇవాళ రైతన్నల బంద్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నేతలతో సహా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రైతు పొట్టగొట్టే కార్పొరేట్ల కడుపునింపే చట్టాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాలు, రాస్తారోకోలతో రవాణా వ్యవస్థను …
Read More »